Home » ఆ సినిమా షూటింగ్ లో సిల్క్ స్మితను చిరంజీవి కొట్టాడా..? కారణం అదేనా ?

ఆ సినిమా షూటింగ్ లో సిల్క్ స్మితను చిరంజీవి కొట్టాడా..? కారణం అదేనా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పట్లో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నాడంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలుండేవి. ఇప్పటిలా అప్పట్లో అంత టెక్నాలజీ లేదు. చిరంజీవి చేసే సినిమాకి సంబంధించి చిన్న పోస్టర్ విడుదల అయితే చాలు.. అభిమానులు ఆ పోస్టర్ ని పేపర్ నుంచి కట్ చేసుకొని ఇంట్లో అతికించుకొని దానిని చూస్తూ ఉండిపోయేవారు. అప్పటి జనాలకు చిరంజీవి అంటే.. అంతటి పిచ్చి అభిమానం ఉండేది.

Advertisement

ముఖ్యంగా చిరంజీవి వాళ్లను నిరాశపరచకుండా వాళ్లు ఎలాంటి చిరంజీవిని అయితే తెరపై చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలనే చేస్తూ.. ప్రేక్షకుల మెప్పు పొందుతూ వచ్చాడు. ఇలాంటి చిరంజీవి కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చేసిన ముఠామేస్త్రీ సినిమా సమయంలో అప్పట్లో ఐటమ్ సాంగ్ డ్యాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిల్క్ స్మితను కొట్టాడు అనే వార్త వినిపించింది. దానికి కారణం ఏంటి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ముఠా మేస్త్రీ సినిమాలో ఫస్ట్ సాంగ్ లో సిల్క్ స్మిత చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ షూటింగ్ జరిగే సమయంలో ఆ సినిమా సెట్ కి తాగేసి వచ్చిన సిల్క్ స్మిత అక్కడ ఉన్న దర్శకత్వం టీమ్ తో, రైటర్లతో గొడవకు దిగిందట. వాళ్లు ఎంత వద్దు అని చెప్పినా ఆమె తగ్గలేదట. దీంతో అక్కడ ఉన్న ఓ వ్యక్తి చిరంజీవి వచ్చాక మీ సంగతి చెబుతారనడంతో చిరంజీవికి నా సంగతి చెప్పేంత సీన్ లేదు అని చిరంజీవి గురించి కూడా ఓవర్ గా మాట్లాడిందట. చిరంజీవి వచ్చి ఎంత కామ్ గా ఉండమని చెప్పినా తాను వినకుండా అల్లరి చేస్తుండటంతో సెట్ అంతా పిచ్చిగా చేయడంతో ఆమెను చిరంజీవి రెండు దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించారట. ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.

 

Also Read : 20 ఏళ్ల క్రితం హీరోయిన్ శ్రియా కి నాగార్జున చేసిన సాయం ఏంటో మీకు తెలుసా ?

Visitors Are Also Reading