Home » పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉంది.. మీరా చోప్రా కామెంట్స్ వైరల్..!

పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉంది.. మీరా చోప్రా కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ సంధ్య అనే అమ్మాయి ప్రేమించిన వాడితో పెళ్లి చేయడానికి పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. . తన లైఫ్ నే రిస్క్ చేసి మరి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు. అయితే ఇప్పుడు బంగారం సినిమా కథా గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ సినిమాలో సంధ్య క్యారెక్టర్ లో నటించిన మీరా చోప్రా ను గుర్తు చేయడానికి ఆ సినిమా గురించి చెప్పాల్సి వచ్చింది.


తెలుగులో మీరా చోప్రా బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు సినిమాలలో నటించింది. అయితే ఎన్ని సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాక తెలుగులో హీరోయిన్ గా రాణించలేకపోయింది. దాంతో ప్రస్తుతం అడపాదడపా తమిళ్ మరియు హిందీ సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తోంది. అయితే ఈ భామ సినిమాల పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక లేటెస్ట్ గా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఈ అమ్మడు సోషల్ మీడియాలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంది.

Advertisement

Advertisement


ఇటీవలనే భారత పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుపై చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో హీరోయిన్ మీరా చోప్రా వరకు చేరింది. దాంతో ఆమె ఈ వీడియో కింద పవన్ కళ్యాణ్ మంచి మనసున్న వ్యక్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయితే చూడాలని ఉంది అని కామెంట్ చేసింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

యూట్యూబర్ తో రిలేషన్ లో ఉన్న నిహారిక .. ఆపోస్ట్ తో క్లారిటీ..!

అక్కినేని మూడో తరం హీరోలు సక్సెస్ సాధించలేరా ? కారణం అదేనా ?

Visitors Are Also Reading