చిన్నతనం నుంచే డాన్స్ పై మక్కువ ఉన్న ఆ అమ్మాయి చిన్న చిన్న కూచిపూడి ప్రదర్శనలిస్తూ వచ్చింది. పెరిగే కొద్దీ శివతాండవం పట్ల మక్కువ పెంచుకుంది. ఇక లాక్డౌన్ టైంలో యూట్యూబ్లో ఒక ఊపు ఊపేసింది. దీంతో మూవీ అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆమె ప్రధాన లక్ష్యం నృత్యం లో డాక్టరేట్ సాధించడమే అని చెబుతున్నది గుత్తా నాగదుర్గ. నల్గొండ జిల్లాకు చెందిన ఈమెకు నాట్యం అంటే చాలా ఇష్టమట. నాట్యకారిణిగా స్థిరపడాలని ఆశ పడింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సాధ్యం కాలేదట.కానీ ఆమెలో ఉన్న ప్రతిభను గుర్తించింది మొదట వాళ్ళ అమ్మ అని చెప్పింది. దీంతో కూచిపూడిలో శిక్షణ కూడా ఇచ్చిందట. దీని ఫలితంగా నాలుగేళ్ల వయసులోనే కాళ్ళకు గజ్జలు కట్టి మొదట కూచిపూడి నృత్యం నేర్చుకుంది.ఇంతలో అమ్మాయిల కోసం పేరిణి నృత్యం ప్రవేశపెట్టారు. దీంతో 14వ యేట ఆమె కల సాకారమయ్యే సమయం వచ్చింది. అప్పటికే పేరిణి నృత్య కారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. నల్గొండలో నాగ దుర్గ నృత్య పాఠశాలను స్థాపించింది. అలా ఎదుగుతూ కొంత మందికి శిక్షణ ఉచితంగా ఇస్తూ వచ్చింది. ఇక కరోణ సమయంలో లాక్ డౌన్ కారణంగా చాలా టైం దొరకడంతో అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా ట్రెండ్ అయిపోయాయి. సరదాగా డ్యాన్సులు చేసి యూట్యూబ్లో పెట్టేదాన్ని. అవి చూసిన చరణ్ నన్ను అప్రోచ్ అయ్యారు. అంతకుముందు చాలా పాటలకు డాన్స్ చేశాను కానీ ప్రొఫెషనల్ గా చేసింది మాత్రం “తిన్నా తీరం పడుతలే” అనే పాటకు చేశానని చెప్పింది.
Advertisement
ఏకంగా ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని, ఆ పాట ఫోక్ సాంగ్ చరిత్రనే మార్చింది అని అన్నది. ఇలా ఫోక్ సాంగ్ కి అలవాటు పడి పోయాడని, ఇప్పటికే 70 పాటలకు పైగా డాన్స్ చేశాను అని చెప్పింది. ఈ సమయంలో నాని నటించిన శ్యామ్ సింగరాయి మూవీలో నటించే అవకాశం కూడా వచ్చింది. ఇటీవల తాజాగా విడుదలైన అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కోసం అడిగారు. కానీ నాకు నటన కంటే నాట్యం ఇష్టం కాబట్టి వాటిని రిజెక్ట్ చేశానని చెబుతున్నది.
Advertisement
ALSO READ;
సూపర్ స్టార్ కృష్ణ సినిమా విడుదల రోజే ఎందుకు 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది.? ఆరోజు ఏమైంది..?
బిగ్ బాస్ విన్నర్‌కి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్..!