Telugu News » బిగ్ బాస్ విన్న‌ర్‌కి బాల‌య్య సినిమాలో బంప‌ర్ ఆఫ‌ర్..!

బిగ్ బాస్ విన్న‌ర్‌కి బాల‌య్య సినిమాలో బంప‌ర్ ఆఫ‌ర్..!

by Anji
Ad

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు గెస్ట్‌గా అనిల్ రావిపూడి వచ్చారు. త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఎఫ్‌3 సినిమా విడుద‌లైన త‌రువాత బాల‌కృష్ణ‌తో ఓ సినిమా ఉంద‌ని చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున ఆ సినిమాలో బిందు మాధ‌వికి రోల్ ఉందా అని అడిగారు. అనిల్ రావిపూడి త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇంకా స్క్రిప్ట్ రాయ‌లేద‌ని.. నీ చేతిలో ప‌నే క‌దా.. రాసెయ్ అన్నారు. నీ చేతిలో ప‌నే క‌దా రాసేయ్ అన్నారు. వెంట‌నే త‌న‌కు స్టార్ ద‌ర్శ‌కుని ద‌గ్గర నుంచి సినిమా ఆఫ‌ర్ రావ‌డంతో బింధు థాంక్స్ చెప్పింది.

Advertisement

గ‌త సీజ‌న్‌లో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా వెళ్లిన మెగాస్టార్ బ్యూటీ కంటెస్టెంట్ దివికి త‌న నెక్స్ట్ సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చిన విష‌యం తెలిసిన‌దే. ఇక ఈసారి గెస్ట్‌గా వెళ్లిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి బిందుమాధ‌వికి ఛాన్స్ ఇచ్చారు ఈ విష‌యంపై బిందు మాధ‌వి తండ్రి స్పందించారు. అనిల్ రావిపూడి సినిమాలో అవ‌కాశం రావ‌డంతో బిందుమాధ‌వి చాలా హ్యాపీగా ఫీల్ అయింద‌ని వెల్ల‌డించారు. బిగ్‌బాస్ విన్న‌ర్ గా నిల‌వ‌డంతో బిందుకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అనుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. ఎంతో నిజాయితీగా, నియ‌మ బ‌ద్ధంగా బిందు గేమ్ ఆడింద‌ని ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగితే త‌ట్టుకోలేద‌న్నారు

Advertisement

అరియానా రూ.10ల‌క్ష‌లు తీసుకుని రావ‌డంతో బిందుమాధ‌వి తండ్రి స్పందించారు. అరియానా చాలా ఇంటెలిజెంట్‌. ఓసారి ఎలిమినేష‌న్‌కు ద‌గ్గ‌ర‌కు రావ‌డంతో త‌న‌కు ఓట్లు ఎలా ప‌డుతున్నాయో అర్థం చేసుకున్న‌ది. మిత్ర ఎలిమినేష‌న్ త‌రువాత టాప్ 4 కంటెస్టెంట్ కు బిగ్ బాస్ డ‌బ్బులు ఆఫ‌ర్ చేసారు. ఈ ఆఫ‌ర్‌ను అరియానా యాక్సెప్ట్ చేసింది. త‌న‌కు ఇల్లు కొనుక్కోవాల‌ని ఉంద‌ని ఆ అమ్మాయి చెప్పింది. టాప్ 3 కంటెస్టెంట్‌కు బిగ్ బాస్‌కు మ‌నీ ఆఫ‌ర్ చేయ‌లేదు. వ‌చ్చే బిగ్ బాస్ సీజ‌న్‌కు యాంక‌ర్ శివ‌ను నాగార్జున రిక‌మెండ్ చేసారు. అఖిల్ కూడా గేమ్ చాలా అద్భుతంగా ఆడాడ‌ని బిందు మాధ‌వి తండ్రి అభినందించారు.

Also Read : 

భ‌ర్త‌లు అక్ర‌మ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు..? 5 కార‌ణాలు ఇవేన‌ట‌..!

జబర్దస్త్ పైమా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు..?

 

Visitors Are Also Reading