Home » నా వెంట్రుక కూడా పీకలేరు.. హరీష్‌ శంకర్‌ కామెంట్స్ వైరల్..!

నా వెంట్రుక కూడా పీకలేరు.. హరీష్‌ శంకర్‌ కామెంట్స్ వైరల్..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ మరోసారి రెచ్చిపోయారు. ఆయన తరచూ మీడియాపై విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా కొన్ని వెబ్‌సైట్స్ ని ఆయన టార్గెట్‌ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఓ వెబ్‌ సైట్‌పై ఆయన రెచ్చిపోయాడు. దాన్ని టార్గెట్‌ చేస్తూ నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

pawan-kalyan-and-raviteja-images

Advertisement

 

రవితేజ హీరోగా నటించిన  ఈగల్ మూవీ  ఫిబ్రవరి 09న విడుదలైంది. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించింది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ కలెక్షన్లు మాత్రం ఫర్వాలేదు. దీనికి పోటీ ఇచ్చే మూవీ లేకపోవడంతో ఉన్నంతలో బెటర్‌ రిజల్ట్ ని పొందుతుంది. అయితే ఓ వెబ్‌ సైట్‌ ఈ మూవీకి చాలా లీస్ట్ రేటింగ్‌ ఇచ్చింది. అది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ట్విట్టర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చాడు. తాజాగా `ఈగల్` సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్‌ శంకర్‌ గెస్ట్ గా హాజరయ్యారు.

Advertisement

 

ముఖ్యంగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనిపై ప్రశంసలు కురిపించారు. ఆయన మేకింగ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. సదరు వెబ్‌ సైట్‌ పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మూవీలో లవ్‌ స్టోరీ లేదని రాశారని.. కానీ సినిమాలో హీరో గన్ను పట్టుకుని యాక్షన్‌ చేస్తుంటే లవ్‌ స్టోరీ అంటాడేంటి? అంటూ చురకలు అంటించారు. అదే సమయంలో సినిమా జరల్నిస్ట్ లు సినిమా ఇండస్ట్రీలో భాగమే అని, వాళ్లు వేరు, మేము వేరు కాదన్నారు. అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్‌ లేదని, ఏదైనా బాగలేకపోతే దర్శకుడు ఇక్కడ బాగా చేశాడు, ఇక్కడ చేయలేదని చెప్పండి. చేసిన మిస్టేక్‌ ఏంటో చెప్పండి, అది కాకుండా పర్సనల్‌ ఎటాక్‌ చేయడం ఏంటని ప్రశ్నించాడు హరీష్‌.

Also Read : 10మంది హీరోలు, వేల కోట్ల ఆస్తి.. ఇండియాలోనే రిచ్చెస్ట్ సినిమా ఫ్యామిలీ ఎవరిది అంటే..?

Visitors Are Also Reading