Home » 10మంది హీరోలు, వేల కోట్ల ఆస్తి.. ఇండియాలోనే రిచ్చెస్ట్ సినిమా ఫ్యామిలీ ఎవరిది అంటే..?

10మంది హీరోలు, వేల కోట్ల ఆస్తి.. ఇండియాలోనే రిచ్చెస్ట్ సినిమా ఫ్యామిలీ ఎవరిది అంటే..?

by Anji
Ad

మన దేశంలో వ్యాపారం నుంచి రాజకీయాల వరకు దేశమంతటా చాలా కుటుంబాలు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. వారి వారి పరిశ్రమలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇందులో సినిమా పరిశ్రమ ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ కుటుంబం మొత్తం నికర ఆస్తి విలువ కపూర్స్ , అక్కినేని వారి కంటే ఎక్కువ. ఈ తెలుగు సినిమా బిగ్ ఫ్యామిలీలో నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు. వాళ్ల రెమ్యునరేషన్ కూడా ఎక్కువే.

Advertisement

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ సౌండ్ పార్టీ సినిమా ఫ్యామిలీ ఎవరిదో కాదు ..మెగాస్టార్ చిరంజీవిది.  దేశంలోనే అత్యంత ధనిక సినిమా కుటుంబం అల్లు-కొణిదెల కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది.  మెగా ఫ్యామిలీగా పేరొందిన అల్లు-కొణిదెల ఫ్యామిలీ తెలుగు చిత్ర పరిశ్రమను శాసిస్తున్నది.  భారతదేశంలోని ప్రముఖ సినీ కుటుంబాల్లో ఈ మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీలో హీరోలతో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర క్రాఫ్ట్స్ లో కూడా బిజీగా ఉన్నారు.  తెలుగు సినిమా ప్రముఖ నటుడు, హాస్యనటుడు మరియు నిర్మాత అల్లు రామలింగయ్య 1950లో మెగా ఫ్యామిలీని స్థాపించారు. ఆతర్వాత రెండు తరాల వాళ్లు ఆ పేరు చెప్పుకొని ఇండస్ట్రీవని ఏలుతున్నారు.

Advertisement

ఈ కుటుంబం తమ పిల్లల ద్వారా తెలుగు చిత్రసీమలో బలమైన ముద్ర వేసింది. అల్లు రామలింగయ్య నలుగురు పిల్లలలో అరవింద్ సినిమా నిర్మాతగా మారారు. కూతురు సురేఖ తెలుగు సూపర్ స్టార్ చిరంజీవిని వివాహం చేసుకుంది.  అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులు తమ వారసులను పెళ్లి చేసుకుని తెలుగు సినిమాకు ఎందరో స్టార్లను అందించారు. ఇంకొందరు స్టార్లను పెళ్లి చేసుకొని ఈ మెగా ఫ్యామిలీలో మెంబర్స్ ని చేశారు. ఉదాహరణకు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగేంద్రబాబు, వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ ఇలా ఎందరో నటీనటులు తెలుగు సినిమాకు అందుబాటులో ఉన్నారు. ఈ ఉమ్మడి కుటుంబం మొత్తం ఖాతాలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహకారం చాలా పెద్దది. మెగా ఫ్యామిలీలోని ప్రముఖుల ఆస్తులను పరిశీలిస్తే.. ఆ ఆస్తుల విలువ రూ.6 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.  ఇందులో గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, అల్లు స్టూడియో సహా 5 చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కుటుంబంలో నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు.

 

Also Read :  పెళ్లికి ముందు నమ్రతకి మహేష్ బాబు పెట్టిన ఆ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా?

Visitors Are Also Reading