Home » నేను సింగిల్ నే.. వైరల్ అవుతున్న వైజాగ్ అమ్మాయి డాన్స్..!

నేను సింగిల్ నే.. వైరల్ అవుతున్న వైజాగ్ అమ్మాయి డాన్స్..!

by Anji
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచిన సినిమాలను ప్రేక్షకులు మళ్లీ థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొదట్లో కేవలం స్టార్ హీరోల మూవీస్ మాత్రమే రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలన్నీ మళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ప్రేమికుల రోజున ఏకంగా 9 సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి ఓయ్.

Advertisement

Advertisement

అప్పట్లో ప్రేమ కథా చిత్రంగా యువతను బాగా ఆకట్టుకున్న ఈ మూవీని.. మళ్లీ ప్రేమికుల రోజున రీ రిలీజ్ చేయగా.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఫేవరెట్ సినిమా రీ రిలీజ్ అంటే.. ఆడియన్స్ థియేటర్ లోనే డాన్స్ లు, విజిల్స్ వేస్తూ హంగామా చేయడం కామన్. ఇప్పుడు ఓయ్ రీ రిలీజ్ లో కూడా ఓ అమ్మాయి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ సంగం థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చిన ఈ అమ్మాయి.. సినిమాలోని ప్రతీ పాటకు దుమ్ములేపే స్టెప్పులతో అదరగొట్టేసింది. థియేటర్ లో ఎల్లో శారీలో ఫుల్ ఎనర్జీతో ఈమె చేసిన డాన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి డాన్స్ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Also Read : పవన్ మూడో భార్య విడాకుల గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా ?

Visitors Are Also Reading