ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని సినిమాలు తీసిన స్టార్డం అనేది రావడం చాలా కష్టం అవుతుంది. కానీ హీరో యష్ మాత్రం కేజిఎఫ్ లాంటి ఒక్క పాన్ ఇండియా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమాతో ఆయన ఏకంగా రాఖీ బాయి అయిపోయారు.. ఇంతటి పేరు సంపాదించుకున్న రాఖీ బాయ్ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది,ఆయన ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు.. ఇష్టమైన హీరో ఎవరు అనే విషయాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి అట. అందువల్ల రాఖీ బాయ్ పాత్ర నాది అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమా నన్ను ప్రభావితం చేసింది.. నేను ఏదైనా పాత్ర చేయాలి అనుకుంటే ఆ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే చేస్తానన్నారు. ఉదాహరణకు ఒక విలేకరి పాత్ర చేయాలంటే.. సమాజంలో విలేకరి ఏ విధంగా ఉంటారో క్షుణ్ణంగా పరిశీలిస్తారని, వారి హావభావాలు బాడీ లాంగ్వేజ్ అన్ని గమనిస్తానని చెప్పుకొచ్చారు.. ఇక సినిమాల విషయానికొస్తే నాకు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు.
Advertisement
Advertisement
also read:అందరినీ ఆకట్టుకునేలా భార్యకి అద్భుతమైన గిప్ట్.. అది చూసి భార్య ఫిదా ..!
ఇందులో రాజ్ కుమార్, అంబరీష్, శంకర్ నాగ్, అమితాబచ్చన్, కమలహాసన్ రజినీకాంత్ ఈ విధంగా చాలామంది నటులకు నేను వీరాభిమానిని, వీళ్ళందరిలో రజనీకాంత్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన నన్ను ఎంతో ప్రభావితం చేశారని యష్ అన్నారు. ఈ విధంగా కే జి ఎఫ్ హీరో రాఖీ బాయ్ ఎప్పటికప్పుడు తనకి ఇష్టమైన విషయాలను ఈ విధంగా ఇంటర్వ్యూలలో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు.. ఒకానొక సందర్భంలో ఆయన కమలహాసన్ నాకు భగవద్గీత అయితే, రజనీకాంత్ సార్ నాకు దేవుడు అని.. మా తలైవా అంటూ చెప్పుకొచ్చారు.
also read: