Home » సినీ ఇండస్ట్రీకి రాకముందు రిషబ్ శెట్టి ఇన్ని కష్టాలు పడ్డాడా ?

సినీ ఇండస్ట్రీకి రాకముందు రిషబ్ శెట్టి ఇన్ని కష్టాలు పడ్డాడా ?

by Anji
Ad

సాధారణంగా జీవితంలో ఏదైనా సాధించాలి అనే సంకల్పం బలంగా ఉంటే చేసే పనిలో నిజాయితీ ఉంటే తప్పకుండా గమ్యాలకు చేరుకుంటారని చాలామంది నిరూపించారు. సినీ ప్రపంచంలో అలాంటి దర్శకులు నటులు చాలామంది ఉన్నారు. తాజాగా కాంతార సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి కూడా చాలా కష్టపడి సినిమా ప్రపంచంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను సినిమా ఇండస్ట్రీకి రాకముందు పడిన కష్టాల గురించి వివరించాడు. అవి ఏంటో  ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

దర్శకునిగా, హీరోగా రిషబ్ శెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కాంతార సినిమాలో తొలుత అతను హీరోగా నటించాలని అస్సలు అనుకోలేదట.చాలామంది హీరోలకు ఆ కథ గురించి వివరించాడట. ముఖ్యంగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ తో కూడా ఈ సినిమా కథ గురించి చర్చలు చేశారు. కానీ ఇలాంటి దైవత్వం ఉన్న కథను నువ్వు చేస్తేనే బాగుంటుంది అని పునీత్ సలహా ఇచ్చాడట.  దీంతో తానే చేసినట్టు చెప్పాడు. రిషబ్ శెట్టి నటుడు కావాలనుకొని సినీఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ తొలుత అతనికి ఎవరు పరిచయం లేదట. ఇక ఎలాగైనా నటుడిని అవ్వాలి అని కోరికతోనే మొదట సహాయక దర్శకుడిగా కొద్ది రోజుల పాటు వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మంచి అవకాశాలు రావడంతో దర్శకుడిగా మారాడు. ఇప్పటివరకు రిషబ్  శెట్టి తెరపైకి తీసుకొచ్చిన సినిమాలన్నీ కూడా వేటికవే భిన్నంగా తిరకెక్కాయి.  కేవలం దర్శకుడిగానే  కాకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా అతను ప్రత్యేకమైన పాత్రలో కూడా కనిపించాడు. సహాయక దర్శకుడిగా ఉన్నప్పుడు అతను తన దర్శకుల ముందు టాలెంట్ చూపించి కొన్ని చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు. 

Advertisement

Also Read :  అందరినీ ఆకట్టుకునేలా భార్యకి అద్భుతమైన గిప్ట్.. అది చూసి భార్య ఫిదా ..!

Rishab Shetty recalls selling water cans to make ends meet before stardom -  Hindustan Times

రిషబ్ శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక కొన్ని పనులు కూడా చేశాడట. చాలా వరకు కూలీ పనులకు వెళ్లాను అంటూ డిగ్రీ చదివేటప్పుడు సినిమాలో చేసేందుకు డబ్బులు అడగాలంటే నచ్చేది కాదు. అందుకే 2004 నుంచి 2014 వరకు కూడా మొదటి డైరెక్షన్ వచ్చేవరకు పదేళ్లపాటు ఎన్నో పనులు చేశాను. కొన్ని హోటల్స్ లో కూడా పని చేశాను అని రిషబ్ శెట్టి వెల్లడించారు. దాదాపు పదేళ్ల పాటు వాటర్ క్యాన్లు కూడా పదేళ్లపాటు అమ్మినట్లు చెప్పాడు. ఇక 2010లో ఒక స్నేహితుడి ద్వారా దొరికిన అవకాశంతో సహాయక దర్శకుడిగా మారాడు రిషబ్ శెట్టి.  మొదట క్లాప్ కొట్టే దశ నుంచి తన ప్రయోగాన్ని మొదలుపెట్టాడు. ఆ తరువాత తన టాలెంట్ తో స్క్రీన్ రైటర్ గా కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్నాడు. తుగ్లక్  అనే సినిమాలో అతను మొదటిసారి వెండితెరపై కనిపించాడు. ఇక మొదట అతను కిరిక్ పార్టీ అనే సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. 

Also  Read :   కమెడియన్ ప్రియదర్శి విలన్ గా కూడా నటించాడు అన్న సంగతి తెలుసా…? ఆ సినిమాలు ఇవే..?

Visitors Are Also Reading