Telugu News » Blog » సంవ‌త్స‌రానికి హైప‌ర్ ఆది ఎంత సంపాధిస్తారో తెలుసా…? హీరోల కంటే ఎక్కువే….!

సంవ‌త్స‌రానికి హైప‌ర్ ఆది ఎంత సంపాధిస్తారో తెలుసా…? హీరోల కంటే ఎక్కువే….!

by AJAY
Ads

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైప‌ర్ ఆది ఒక‌రు. అదిరే అభి టీం ద్వారా హైప‌ర్ ఆది జ‌బ‌ర్ద‌స్త్ కు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర‌వాత తన పంచ్ ల టైమింగ్ తో….స్క్రిప్ట్ రైటింగ్ తో అతి త‌క్కువ కాలంలోనే టీం లీడ‌ర్ గా ఎదిగాడు. ఇక ఆత‌ర‌వాత జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న స్కిట్ ల‌తో ఎంతో మంది అభిమాన‌లను సంపాదించుకున్నాడు. ఇప్ప‌టికీ హైప‌ర్ ఆది స్కిట్ ల‌కు మిలియ‌న్ ల కొద్ది వ్యూవ్స్ కూడా వ‌స్తున్నాయి.

Ads

అంతే కాకుండా చాలా మంది జ‌బ‌ర్ద‌స్త్ ను వీడినా హైప‌ర్ ఆది మాత్రం అందులోనే కొన‌సాగుతున్నారు. దాంతో మ‌ల్లెమాల వారు హైప‌ర్ ఆదికి గ‌ట్టిగానే రెమ్యున‌రేషన్ ఇస్తార‌ట‌. హైప‌ర్ ఆది రెమ్యున‌రేషన్ ల‌క్ష‌ల్లో ఉంటుంద‌ని టాక్. జ‌బ‌ర్ద‌స్త్ తో పాటూ ఇత‌ర టీవీ షోలు మ‌రియు ఈవెంట్ ల ద్వారా ఏడాదికి కోట్ల‌ల్లో సంపాదిస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే తాజాగా హైప‌ర్ ఆది ఓ ఇంట‌ర్వ్యూలో త‌న రెమ్యున‌రేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేశాడు.

Ads

తాను చ‌దువుకునేట‌ప్పుడు చ‌దువుల కోసం ఇతర ఖ‌ర్చుల కోసం 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు అయ్యాయ‌ని చెప్పాడు. దాంతో 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ అప్పులు అయ్యాయ‌ని చెప్పారు. ఆ అప్పులు తీర్చ‌డానికి త‌న తండ్రి మూడెక‌రాల పొలాన్ని అమ్మాల్సి వ‌చ్చిదంట‌. ఇక తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర‌వాత 16 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశాన‌ని హైప‌ర్ ఆది చెప్పాడు.

Ad

అంతే కాకుండా ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాన‌ని తెలిపారు. మ‌రోవైపు హైద‌రాబాద్ లో కూడా ఓ ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు హైప‌ర్ ఆది తెలిపారు. ఇదిలా ఉండ‌గా హైప‌ర్ ఆది బీటెక్ పూర్తి చేసి మొద‌ట సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసారు. కానీ తర‌వాత త‌న‌కు సినిమాల్లో ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు.