పెళ్లి అంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. భార్య భర్తల మధ్య మనస్పార్థాలు తరుచూ చోటు చేసుకుంటాయి. దీంతో కొందరూ విడాకులు తీసుకుంటారు. మరికొందరూ సహనంతో అలాగే ఉండిపోతారు.ఈ తరుణంలోనే భార్యకు తెలియకుడా రెడవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఓ ఆలయంలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటండగా.. ఆర్య, అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది.ఈ ఘటన ఏపీలోని పెనుగంచిప్రోలులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ జిల్లా నల్లగొండ జిల్లా భువనగిరికు చెందిన చెరుకుమల్లి మధుబాబుకు హైదరాబాద్ బోడుప్పల్ చెందిన సరితతో నాలుగేండ్ల కిందటే పెళ్లి యఇంది. అత్తింటి వారు వరకట్న వేధింపులకు పాల్పడడంతో సరిత మూడు సంవత్సరాలుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది.
Also Read : పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో తీవ్ర విషాదం..!
Advertisement
Advertisement
అత్తింటివారు వరకట్న వేధింపులకు పాల్పడుతుండడంతో గత మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. భువనగిరి పోలీస్ స్టేషన్లో సరిత కేసు పెట్టగా.. దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే.. విచారణ కొనసాగుతుండగానే మధుబాబు గతంలో రెండుసార్లు వివాహం చేసుకోబోగా సరిత అడ్డుకుంది. అయితే.. ఈ సారి మధుబాబు గుట్టుచప్పుడు కాకుండా కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకున్నాడు. ఈ తరుణంలోనే ఆదివారం మధుబాబు వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబాలతో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి చేరుకున్నాడు. ఆలయంలో పెద్ద తిరునాళ్ల కావడంతో భక్తుల సంఖ్య భారీగానే ఉంది. వివాహం జరుగుతుందనే విషయం సరిత, ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. సరిత కుటుంబ సభ్యులతో కలిసి మధుబాబు వివాహాన్ని అడ్డుకుంది.
గతంలో పెళ్లి జరిగిందని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో వారు కూడా మధుబాబు కుటుంబ సభ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మండపానికి వివరాలు తెలుసుకున్నారు. మధుబాబును పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ కేసు ఇప్పటికే భువనగిరి పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని ఇరు కుటుంబాలకు పోలీసులు నచ్చజెప్పి పంపించారు.
Also Read : ఆ బాలుడు తొమ్మిదేళ్ల వయస్సులోనే యోగా గురువు.. గిన్నిస్ బుక్లో చోటు