Home » పునీత్ రాజ్ కుమార్ ఇంట మ‌రో తీవ్ర విషాదం..!

పునీత్ రాజ్ కుమార్ ఇంట మ‌రో తీవ్ర విషాదం..!

by AJAY
Ad

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణ వార్త‌ను అభిమానులు ఇంకా మ‌ర్చిపోనేలేదు. ఆయ‌న కుటుంబ సభ్యులు సైతం ఇప్ప‌టికీ దుఖఃలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ స‌తీమ‌ణి భార్య అశ్విని తండ్రి భ‌గ్మ‌నే రేవ‌నాత్ గుండె పోటుతో మ‌ర‌ణించారు. పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణించిన నాటి నుండి భ‌గ్మ‌నే రేవనాత్ తీవ్ర ఒత్తిడి ఆవేద‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

puneeth rajkumar

puneeth rajkumar

78 ఏళ్ల రేవ‌నాత్ ఆ ఒత్తిడి కార‌ణంగానే మృతి చెందిన‌ట్టు కుంటుంబ స‌భ్యులు చెబుతున్నారు. గుండె పోటు వ‌చ్చిన త‌ర‌వాత రేవ‌నాత్ ను కుటుంబ స‌భ్యులు వెంట‌నే బెంగుళూరులోని ఎం ఎస్ రాజ‌య్య ఆస్ప‌త్రిలో చేర్పించారు. అయితే అప్ప‌టికే రేవ‌నాత్ మృతి చెందిన‌ట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఆయ‌న మృతితో కుటుంబ స‌భ్యులు విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే భ‌ర్త మృతితో ఆవేద‌న చెందుతున్న అశ్విని ఇప్పుడు తండ్రి మృతితో మరింత ఆందోళ‌న చెందున్నారు.

Advertisement

Visitors Are Also Reading