పెళ్లి, అనేది ఓ మధురమైన అనుభూతి. అయితే వివాహం, అనేది తగిన వయసులో జరిగితేనే దానికి అర్థం ఉంటుంది. కానీ చాలామంది ఏజ్ బార్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు.
Advertisement
ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనేక ఇబ్బందులు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, తాజాగా భార్యాభర్తల జీవితంలో మరపురాని తొలిరాత్రి ఘట్టాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ కిరాతక భర్త.
read also : దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?
ఈ సంఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. భార్యతో తొలి రాత్రి మదిలో భద్రంగా నిలుపుకోవాల్సింది పోయి, వాటిని రికార్డు చేయడమే కాక, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోనసీమ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫిబ్రవరి 8న అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం అయింది. అయితే అనూహ్యంగా అతడి మొదటి రాత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం కాస్త వధువు కుటుంబానికి తెలియడంతో, వధువు తల్లి గతనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisement
READ ALSO : ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?
ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే దాని గురించి పోలీసులు విచారించగా, దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతటి దారుణానికి పాల్పడింది మరి ఎవరో కాదు నవ వరుడే. స్వయంగా భర్తే. తమ తొలిరాత్రి దృశ్యాలను సీక్రెట్ గా రికార్డు చేసి దాన్ని అతడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటన గురించి తెలియగానే పెద్దమనుషులు పంచాయతీలో సెటిల్ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కానీ వధువు తల్లి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
read also : దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?