సాధారణంగా సంసారం అన్న తరువాత సవా లక్ష ఒత్తిడులు ఉంటాయి. దీంతో సహజంగానే భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు సంభవిస్తుంటాయి. ఇలాంటివి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మీరు గొడవ పడే సమయంలో మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారా..? లేదా అనేది చూడాలి. ఒకవేళ గమనించినట్టయితే మీరు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నట్టే లెక్క అని నిపుణులు పేర్కొంటున్నారు. మీరు పిల్లల ముందు గొడవపడితే ఆ గొడవల ప్రభావం పిల్లలపై పడి భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయి. ఇక మీ పిల్లల ముందు మీరు చేయకూడనీ, చేయాల్సిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మీరు పిల్లల ముందు గట్టిగా అరవడంతో వారు భయపడిపోతుంటారు. దీంతో నిద్రలో కూడా వారు ఆ గొడవనే తలచుకునే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలు ఉన్నప్పుడు గట్టిగా అరంకండి. వాగ్వాదం ఎక్కువైతే ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గండి తప్పులేదు. అలా కాకుండా చేయి చేసుకొవడం లాంటివి పిల్లల ముందు చేస్తే వారి మనసులో అవి బలంగా నాటుకు పోతాయి. పిల్లల పెంపకంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి.
Advertisement
ఇది కూడా చదవండి : మీ కంటి చూపు మందగిస్తుందా..? భోజనం చేసిన తరువాత ఈ పనులు తప్పక చేయండి..!
అప్పుడే వారికి మీ మీద ప్రేమ పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భార్య, భర్తలమధ్య గొడవ జరిగిన తరువాత పిల్లల్ని నీకు అమ్మ కావాలా..? నాన్న కావాలా అని అడుగుతారు. ఈ ప్రశ్నలపై పిల్లలపై విపరీతమైన ఒత్తిడి తెస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వారి మానసిక ప్రవర్తన కూడా మారే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. అలాగే మీరు ఎప్పుడైనా గొడవ పడాల్సి వస్తే లేదా గొడవ పడితే అది పర్సనల్ గది దాటి బయటికీ రానీయకూడదు. దీంతో మీ పిల్లలకు మీపై ప్రేమ, అభిమానం పెరుగుతాయి.
ఇది కూడా చదవండి : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వ్యాపారంలో జాగ్రత్త వహించాలి