ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈరోజు ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 16.09.2022: మేషం
వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహాలు సూచితం. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి.
Today rashi phalau in telugu: వృషభం
మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu: మిథునం
చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
Today rashi phalau in telugu : కర్కాటకం
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్ని నియమాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంభించడం మంచిది.
Today rashi phalau in telugu : సింహం
దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.
Today rashi phalau in telugu : కన్య
పనుల్లో జాప్యం జరుగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు.
Advertisement
Today rashi phalau in telugu : తుల
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పని చేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
మంచి కాలం నడుస్తోంది. సత్కార్యాల కోసం సమయాన్ని వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కలిసి కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
Today rashi phalau in telugu : మకరం
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : కుంభం
తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.
Today rashi phalau in telugu : మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.
ఇది కూడా చదవండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది