ప్రస్తుత కాలంలో ఆడవారు మగవారు సమానంగా స్థాయిలో జాబ్స్ చేస్తున్నారు.. మగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఆడవారు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ తరుణంలో భార్య, భర్త కింద అనిగిమణిగి ఉండాలనే భావన చాలావరకు తగ్గిందని చెప్పవచ్చు. దీంతో చాలామంది భార్యలు, భర్తలు ఎక్కువగా ఫ్రీడంనే కోరుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత అంత ఫ్రీడం లేకపోతే చాలా ఈజీగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ తరుణంలో తాజాగా ఒక సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చాలామంది భార్యాభర్తలు కలిసి పడుకోవడానికి ఇష్టపడడం లేదట .
also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదెలే’ డైలాగ్ వెనుక దాగి ఉన్న కథ ఇదే..!
Advertisement
దీనికి కారణం ఏంటో చూద్దాం.. భార్య భర్తలు అన్నాక కలిసి ఒక దగ్గర పడుకోవడం సాధారణమే. ఈ అలవాటు మొదటి రాత్రి నుంచి మొదలవుతుంది. ఇలా జీవితకాలం ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో యంగ్ దంపతులు కూడా కలిసి పడుకోడానికి ఇష్టపడడం లేదట.. తాజాగా అమెరికాలో వన్ పోల్ సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ఐదుగురిలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఫ్రీగా సపరేట్ గా పడుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. దీనికి కారణం నిద్రలోకి జారుకునే ముందు భార్యలు భర్తను విసిగించడం, భర్తలు భార్యని విసిగించడం , పడుకున్నాక డిస్టర్బ్ చేయడం, రాత్రి అయ్యే వరకు భర్త లేదా భార్య టెలివిజన్ చూస్తుండడం, గురక, లైట్స్ ఆన్ చేయడం వంటివి చికాకు కలిగిస్తున్నాయని దీనివల్ల భార్యాభర్తలు కలిసి పడుకునేందుకు ఇష్టపడడం లేదని ఈ సర్వే ద్వారా తేలింది.
Advertisement
also read:నాకు ఆ అమ్మాయి కోడలిగా కావాలంటున్న ప్రభాస్ తల్లి..!!
అందుకే చాలామంది దంపతులు ఆరోగ్యవంతమైన నిద్ర కోసం వేరువేరుగా పడుకునేందుకే మొగ్గు చూపుతున్నారని తేలిందట. అంతేకాకుండా పడుకునే ముందు స్నానం చేస్తారా అని ప్రశ్నించగా.. మూడింట రెండు వంతుల మంది అవునన్నారట, 58 శాతం మంది భాగస్వామితో నిద్రించే ముందు స్నానం చేయకపోవడం మూలంగా ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారట. అంతేకాకుండా ఇక పిల్లల వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పే తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారని తేలింది. ఇక దీనిపై స్పందిస్తున్న నిపుణులు డే టైంలో యాక్టివ్ గా ఉండాలంటే రాత్రి సమయంలో మంచి నిద్ర కావాలని అంటున్నారు. దానికి అనుగుణంగా మెదిలితేనే ఆరోగ్యం బాగుంటుందని వారు సూచిస్తున్నారు.
also read:డబ్బు సమస్యలు ఉన్నాయా.. కర్పూరంతో ఇలా చేస్తే చాలు అన్ని లాభాలే..!!