Home » ‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!

‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!

by Anji
Ad

ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద సినిమా  ఏదైనా ఉందంటే అది అవతార్ అనే చెప్పాలి. అంతకు ముందు టైటానిక్ మూవీ ఉండేది. టైటానిక్ సినిమాని దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరాన్ అవతార్ ని తెరకెక్కించాడు. ముఖ్యంగా బడ్జెట్ పరంగా, కలెక్షన్ల వైజ్ గా ఎక్కువ ఆదరణ పొందిన సినిమాగా అవతార్ నిలిచింది. ప్రపంచ రికార్డులను తిరగరాసింది. విజువల్ వండర్ గా భావించే ఈ మూవీని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇష్టపడటం విశేషం. 

Advertisement

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మదిలో పుట్టిన ఒక ఆలోచన 20వ సెంచరీ ఫాక్స్ ద్వారా నిజమైంది.  అవతార్ సిరీస్ 2009లోనే  ప్రారంభం అయింది. ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించి ప్రపంచ రికార్డులను సృష్టించింది. దీంతో  ఈ సిరీస్ లో వచ్చే సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది డిసెంబర్ నెలలో అవతార్ 2 విడుదల అయింది. ఫస్ట్ సినిమా రేంజ్ లో అవతార్ 2 సక్సెస్ కాలేకపోయింది. విజువల్స్ చాలా  అద్భుతంగా ఉన్నప్పటికీ అందులో ఎమోషన్స్ మాత్రం క్యారీ కాలేదు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కలెక్షన్ల పరంగా కూడా యావరేజ్ గానే నిలిచింది. అవతార్ ఫస్ట్ పార్ట్ 2.93 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం.. రూ. 24వేల కోట్లు, సెకండ్ పార్ట్ 2.3 బిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే దాదాపు రూ.19వేల కోట్లు మాత్రమే. 5 పార్ట్ లుగా రాబోతున్న అవతార్ మూవీకి సంబంధించి మిగిలిన 3 ఫార్ట్ లపై ఆశలు పెట్టుకున్నారు మేకర్స్.

Advertisement

వాస్తవానికి గత ఏడాదే అవతార్ 3,4,5 పార్ట్ ల కి సంబంధించి రిలీజ్ డేట్లను ప్రకటించింది నిర్మాణ సంస్థ. మూడో పార్ట్ వచ్చే ఏడాది డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు నాలుగో పార్ట్ 2026 డిసెంబర్ 18న, ఐదో పార్ట్ 2028 డిసెంబర్ 22 న అనుకున్నారు. ప్రతీ రెండేండ్లకు ఒకసారి ఒక్కోపార్ట్ ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని జేమ్స్ కామెరాన్, 20వ సెంచరీ ఫాక్స్ భావించారు. తాజాగా అవతార్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది యూనిట్. మిగిలిన మూడు పార్టులు భారీగా డిలే అవుతున్నట్టు వెల్లడించింది. దీంతో విడుదల తేదీలలో భారీగా మార్పులు చేశారు మేకర్స్. 

Avatar

తాజాగా అవతార్3ని 2025 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అవతార్ 4ని 2029 డిసెంబర్ 21న, అవతార్ 5ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నారు. దీంతో మిగిలిన మూడు పార్ట్ లు నాలుగేళ్ల గ్యాప్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అవతార్ 2 పై వచ్చిన విమర్శలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరింత వర్క్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే అవతార్ సిరీస్  విడుదల తేదీలను మార్చినట్టు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అవతార్ ప్రియులను ఈ వార్త తీవ్ర నిరాశకు గురిచేస్తుందనే చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మొదటి సారి కమర్షియల్ యాడ్ కి ఒప్పుకున్న రాజమౌళి.. అందులో అంత ఇంటరెస్టింగ్ ఏముంది?

స్విగ్గి చేసిన పనికి షాక్ లో షారుఖ్ ఖాన్..అసలేమైందంటే?

Adipurush Movie Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Visitors Are Also Reading