Home » వంద కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్ ఫైటర్.. ఇప్పటివరకు 14 సార్లు.. లిస్ట్ ఇదే..!

వంద కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్ ఫైటర్.. ఇప్పటివరకు 14 సార్లు.. లిస్ట్ ఇదే..!

by Anji
Ad

బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ఫైటర్. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. వార్ తర్వాత హృతిక్ సిద్ధార్థ ఆనంద్ కాంబినేషన్లో రూపొందించిన సినిమా ఇది. పటాన్ తర్వాత వస్తున్న సిద్ధార్థ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రెండు రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసింది. దీంతో హృతిక్ రోషన్ 14వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరారు.

Advertisement

ఫైటర్ మూవీతో హృతిక్ రోషన్ ఖాతాలో మరో రికార్డు కూడా నమోదయింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డేకి విడుదలై 100 కోట్లు క్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీ గా నిలిచింది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. పాజిటివ్ టాక్.. హృతిక్ రోషన్ పవర్ పుల్ పర్ఫామెన్స్ ఫైటర్ మూవీ అభిమానులను అలరిస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. వార్ తర్వాత సింగిల్ డే లో రూ.40 కోట్లు సాధించిన హృతిక్ రెండో చిత్రంగా రికార్డు సాధించింది.

Advertisement

 

హృతిక్ రోషన్ కెరీర్ లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ మూవీతో ప్రారంభమైంది. క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ వంటి చిత్రాలు అప్పట్లోనే 100 కోట్లు సాధించాయి. జిందా న మిలేగా, దోబారా, మొహంజదారో, సూపర్ 30, విక్రమ్ వేద వంటి సినిమాలు 100 కోట్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి.

100 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితా :
1. కభీ ఖుషి కభీ గమ్
2. క్రిష్
3. ధూమ్ 2
4. జోధా అక్బర్
5. జిందా న మిలేగా దోబారా
6. అగ్నిపథ్
7. క్రిష్ 3
8. బ్యాంగ్ బ్యాంగ్
9. మొహంజదారో
10. కాబిల్
11. సూపర్ 30
12. వార్
13. విక్రమ్ వేద

14.ఫైటర్

Visitors Are Also Reading