Home » ప్రామిస‌రీ నోట్ ఎలా రాయలంటే? ఇవి పాటించ‌క పోతే డ‌బ్బు గోవిందా!

ప్రామిస‌రీ నోట్ ఎలా రాయలంటే? ఇవి పాటించ‌క పోతే డ‌బ్బు గోవిందా!

by Bunty
Ad

ప్ర‌స్తుత కాలం లో మ‌నుషులు.. తోటి మ‌నుషుల ను న‌మ్మ‌డం లేదు. అందుకే మాట కు ప్ర‌త్యామ్నాయం ప్రామిస‌రీ నోట్ లు వ‌చ్చాయి. గ‌తంలో మాట కు క‌ట్టుబ‌డి ఉండే వారు కాబ‌ట్టి.. ఇలాంటి పేప‌ర్లు ఏమీ ఉండేవి కాదు. కానీ ప్ర‌స్తుత కాలం లో సాక్ష్యం గా పేప‌ర్ లేకుంటే.. అంతే సంగ‌తులు అన్న‌మాట‌. ఈ పేప‌ర్లు ప్ర‌స్తుతం కాలం లో ముఖ్యం గా అప్పు ఇవ్వ‌డం.. లేదా తీసుకునే స‌మ‌యాల్లో ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. వాటినే ప్రామిస‌రీ నోట్ అని అంటారు. అయితే ప్రామిస‌రీ నోట్ కు కూడా కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. దాని లో ఒక‌టి పాటించ‌క పోయినా.. ఆ ప్రామిస‌రీ నోట్ చెల్లుదు. అంతే కాదు.. మ‌న డ‌బ్బులు కూడా గోవిందా.. అయిన‌ట్టే.

Also Read: పెళ్లి చేసుకోక‌పోతే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..?

Advertisement

అలా జ‌ర‌గ‌కూడ‌దు అంటే ప్రామిస‌రీ నోట్ కు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌లు తెలుసుకోవాల్సిందే. ప్రామిస‌రీ నోట్ కు సంబంధించి ముఖ్య మైన రూల్స్ ను ఇప్పుడు మ‌నం చూద్దాం. మొద‌ట గా అప్పు ఇచ్చే వాళ్లు.. అప్పు తీసుకునే వాళ్లు ఇద్ద‌రు కూడా 18 ఏళ్ల వ‌య‌స్సు నిండి ఉండాలి. ఇందులో ఏ ఒక్క‌రూ 18 ఏళ్లు లేకుంటే.. ఆ ప్రామిస‌రీ నోట్ చెల్ల‌దు. అలాగూ ప్రామిస‌రీ నోట్ కేవ‌లం మూడు సంవ‌త్సారాల కాల వ్య‌వ‌ధి వ‌ర‌కే చెల్లుతుంది. దీని త‌ర్వాత కూడా ఉండాలంటే కొత్త ప్రామిస‌రీ నోట్ రాసుకోవాల్సిందే. అంటే కొత్త డేట్ తో స‌హా. అలాగే ప్రామిస‌రీ నోటు రాసే స‌మ‌యం లో అప్పు ఇచ్చే వారు.. తీసుకునే వారు త‌ప్ప‌క ఉండాలి. దీంతో పాటు ప్రామిస‌రీ నోట్ పైన రెవెన్యూ స్టాంప్ త‌ప్ప‌క వేయాలి.

Advertisement

How to write promissory note Telugu

How to write promissory note Telugu

అలాగే దాని పై అడ్డం గా సంతకం చేయాలి. ఆ రెవెన్యూ స్టాంప్ కూడా క‌నీసం రూపాయి విలువ కలిగి ఉండాలి. అలాగే ప్రామిస‌రీ నోట్ తో కోటి రూపాయ‌ల వ‌ర‌కు మాత్ర‌మే అప్పు గా ఇయ్య వచ్చు. కోటి రూపాయ‌ల‌కు మించి ఉంటే ఆ ప్రామిస‌రీ నోట్ చెల్ల‌దు. అలాగే ప్రామిస‌రీ నోట్ లో నేనే ఫ‌లానా వ్య‌క్తి నుంచి అప్పు తీసుకున్నాను.. తిరిగి ఆయ‌న కు గానీ ఆయ‌న చూపించిన వ్య‌క్తి కి గానీ డ‌బ్బుల‌ను ఇచ్చేస్తాను. అని రాసి లేకుంటే ఆ ప్రామిస‌రీ నోట్ ప‌ని చేయ‌దు. అలాగే ప్రామిస‌రీ నోట్ ను మ‌తిస్థిమితం లేని వ్య‌క్తు ల‌తో రాయించ రాదు. అలా చేస్తే ఆ నోట్ చెల్ల‌దు. ఈ నియ‌మాల‌ను పాటించి ప్రామిస‌రీ నోట్ రాయాలి. ఇందులో ఒక‌టి మిస్ అయినా.. భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు

Also Read: మ‌నీ ప్లాంట్ ను ఏ దిక్కున నాటాలో తెలుసా? అలా చేస్తే అపాయ మే!

Visitors Are Also Reading