ప్రస్తుతం చాలా మంది యువత సోలో లైఫే సో బెటర్ అనుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యల కంటే చేసుకోకపోతేనే వచ్చే సమస్యలు ఎక్కువ అని మానసిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం….కొంతమంది తమ కుటుంబం కోసం త్యాగాలు చేసి పెళ్లి చేసుకోకుండా 40ఏళ్ల వరకూ అలాగే ఉండిపోతారు. కానీ వారి కుంటుంబంలోని ఒక్కక్కరూ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటిరిగా మిగిలిపోతారు. అప్పుడు పెళ్లి గురించి ఆలోచించినా ప్రయోజనం ఉండదు. కానీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటే చివరికి భరోసా ఉండదట. వాళ్లకు ఏదైనా బాధవచ్చినా అప్పుడు ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోరట.
ఆరోగ్యం భాగాలేకపోయినా ఏమైనా చూసుకునేవారు ఉండరు. పెళ్లి అనేది మానసిక భరోసాను ఇస్తుందట. పెళ్లి తరవాత గొడవలు పెట్టే భర్తలు భార్యలే కాకుండా ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉండేవారు భరించేవారు కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటే సమాజపరంగా కూడా సెక్యురిటీ వస్తుంది. అన్ని సుఖాలు భయటదొరుకుతున్నాయి కదా అని కొందరు పెళ్లికి దూరంగా ఉంటారు.
also read : గుడ్ న్యూస్ : చూయింగ్ తో కరోనాకి చెక్..!
అలా ఉండేవాళ్లకు ఆరవైఏళ్లు వచ్చిన తరవాత ఏడవాల్సిందేనని…చాలా కష్టాలు వస్తాయని మాససిన నిపుణులు చెబుతున్నారు. కొంతమంది సమాజ సేవకోసం పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటారు. అలాంటి వారికి ఇరవై ఏళ్లు వచ్చిన్పుడు కూడా సమాజం వదిలేస్తుందట. కాబట్టి సమాజ సేవ చేసినా పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకోవాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల భర్త చనిపోయినా…లేదంటే భార్య చనిపోయినా భయటివారి గురించి ఆలోచించకుండా తమ కోసం తమ కుటుంబం కోసం పెళ్లి చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.