చాలా మంది ఇళ్లలో మొక్కలని పెంచుతూ ఉంటారు. గులాబీ పూలు ఇంట్లో ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని అవి తీసుకువస్తాయి. గులాబీ పూలు రంగురంగుల్లో ఉంటాయి. అయితే మన ఇంట్లో గులాబీ మొక్కలు బాగా వచ్చి, పూలు బాగా పూయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా మంది గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుతుంటారు. కానీ గులాబీ పూలు సరిగ్గా పూయవు. అవి చనిపోతూ ఉంటాయి అలా కాకుండా మీ పెరట్లో గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇలా చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే కచ్చితంగా గులాబీ పూలు బాగా పూస్తాయి.
Advertisement
Advertisement
గులాబీ మొక్కకి కొమ్ములు ఎక్కువగా ఉంటే వాటిని కత్తిరిస్తూ ఉండండి. ప్రధాన కొమ్మ మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగిస్తూ ఉండండి ఇలా చేస్తే పూలు బాగా పూస్తాయి. పేడ ముద్దల్ని తయారు చేసి కత్తిరించిన కొమ్మల చివరన పెడితే త్వరగా చిగుళ్ళు వస్తాయి. నర్సరీ నుండి తెచ్చిన గులాబీ మొక్కల్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు వర్మీ కంపోస్ట్ కోకో పిట్ కాస్త వేప పిండి మట్టిలో వేసి బాగా కలిపి ఆ తర్వాత మొక్కని నాటండి. అయితే ఈ మట్టిని ముందు సూర్యకాంతి తగ్గేలా ఒక వారం రోజులు పాటు పెట్టి భద్రపరిచి ఆ తర్వాత మొక్కని నాటారంటే పూలు బాగా పూస్తాయి. మట్టిలో పీహెచ్ వాల్యూ 4 నుండి 6 మధ్య ఉండేటట్టు చూసుకోవాలి. లీటర్ నీళ్లలో రెండు గ్రాముల సల్ఫర్ కలిపి ఆకులపై చల్లితే గులాబీ పూలు బాగా పూస్తాయి.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు
- తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?
- పల్లవి ప్రశాంత్ తో రతిక లవ్ ట్రాక్ నడిపిస్తుందా ?