Home » మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వాడితే.. జ్ఞాపక శక్తి తగ్గిపోతుందా…?

మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వాడితే.. జ్ఞాపక శక్తి తగ్గిపోతుందా…?

by Sravya
Ad

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వలన ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. నిజానికి చాలామంది స్మార్ట్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన మనిషి యొక్క జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది. తరచూ ఫోన్ చూసుకుంటూ ఉండడం, ప్రతి విషయానికి ఫోన్ మీద ఆధారపడడం వంటి అలవాట్లు వలన మెదడుపై ప్రభావం పడుతుంది.

Advertisement

Advertisement

అవసరం వున్నా లేకపోయినా ఫోన్ చూస్తూ చాలామంది అలా ఉండిపోతూ వుంటారు. పదే పదే ఫోన్ చెక్ చేసుకోవడం వంటివి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడూ కూడా స్మార్ట్ఫోన్ ని పక్కనే పెట్టుకుంటూ చూస్తూ ఉంటే మెదడు చురుకుదనం తగ్గిపోతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడడం వలన జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ని వాడడం వలన ఇలా అనేక నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎడిక్ట్ అయిపోవడం అసలు మంచిది కాదు.

Also read:

Visitors Are Also Reading