Home » కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు జరిగాయి… ఇదే సాక్ష్యం!

కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు జరిగాయి… ఇదే సాక్ష్యం!

by Bunty
Ad

 

టీమిండియా క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలది ఓ చరిత్ర. వీరిద్దరూ ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో విజయాల్ని అందించారు. తమ ఆటతీరుతో కోట్లాదిమంది ఫాన్స్ ను సంపాదించుకున్నారు. టీమిండియాలో కీలక ప్లేయర్లుగా మారారు వీరు ఇద్దరు. అయితే కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. తాజాగా టీం ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. వారిద్దరి మధ్య స్వల్ప విభేదాలున్న మాట వాస్తవమేనని చెప్పాడు.

Advertisement

ధోని రిటైర్ అయ్యాక ఆ గొడవలు ఎక్కువ అయ్యాయని తెలిపాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం అప్పటి కోచ్ రవి శాస్త్రి ఈ సమస్యను ఎలా పరిష్కరించాడనే విషయాన్ని తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీం లో రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం గురించి చాలా చర్చ జరిగింది. రోహిత్, కోహ్లీ ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు.

Advertisement

విరాట్ క్యాంపు, రోహిత్ క్యాంపు అని టీములో రెండు సెపరేట్ గ్రూపులు కూడా ఉండేవి. వెస్టిండీస్ తో టి 20 సిరీస్ కోసం యూఏ కి వెళ్ళాము. అక్కడికి వెళ్లగానే రవి శాస్త్రి విరాట్, రోహిత్ ను తన రూముకు పిలిపించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నాడు. వీరి ఇష్యూలో రవిశాస్త్రి జోక్యం చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోలేదు. కొత్తగా మొదలెట్టాలని చేతులు కలిపారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు. అన్నింటికీ ముందు టీం, రవి శాస్త్రం నమ్మింది ఇదే అని శ్రీధర్ చెప్పాడు.

READ ALSO : Taraka ratna : తారకరత్న ట్రీట్మెంట్ కు లక్షల్లో ఖర్చు…ఎవరు భరిస్తున్నారు తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading