Home » ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ? వాటి కోసమే అంతనా..!

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ? వాటి కోసమే అంతనా..!

by Anji
Ad

గత నెల రోజులుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీపై హైప్ ఎక్కువగానే ఉంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ కూడా అద్భుతంగానే ఉంది. దీనిని బట్టి చూస్తే ఇక మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో జూన్ 06న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు లక్షకు పైగా అభిమానులు వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించి ఖర్చు చేసిన వివరాలను ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 

Advertisement

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటిలోని తారకరామ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు రూ.50లక్షల విలువైన క్రాకర్స్ ఏర్పాటు చేశారట. అదేవిధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో అయోధ్య సెట్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులను ఆయనే దగ్గరుండి మరీ చూసుకున్నారట. ఇక ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం దాదాపు 8 నెలలుగా ఎవ్వరూ నిద్రపోలేదని.. ఓంరౌత్ మామూలు ఫైట్ చేయలేదన్నారు. అంతగా కష్టపడే దర్శకుడిని ఈ 20 ఏళ్లలో నేను చూడలేదన్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 16న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీని టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటేడ్ సంయుక్తంగా నిర్మించాయి. తొలిసారిగా ప్రభాస్ రాముడిగా కనిపించనుండటంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వేణు స్వామి చెప్పిందే మరోసారి జరగబోతుందా..? అది ఏంటంటే…?

 పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్…ఎప్పుడు ఎక్కడ చేసుకోబోతున్నాడాంటే..?

Visitors Are Also Reading