Telugu News » Blog » అనిల్ రావిపూడి తో జరిగిన గొడవ వల్లే తమన్నా ఎఫ్- 3 ప్రమోషన్స్ కు దూరంగా ఉందా….అసలేం జరిగిందంటే..!

అనిల్ రావిపూడి తో జరిగిన గొడవ వల్లే తమన్నా ఎఫ్- 3 ప్రమోషన్స్ కు దూరంగా ఉందా….అసలేం జరిగిందంటే..!

by AJAY

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ లో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈ సినిమా సీక్వెల్ గానే ఎఫ్ 3 సినిమా ను తెరకెక్కించారు. అయితే అనిల్ ఇక్కడ ఎఫ్ 2 కు కొనసాగింపు కాకుండా మరో కొత్త కథను తీసుకున్నాడు. ఈ సినిమాలో సునీల్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి తమన్నా తో జరిగిన గొడవ గురించి వెల్లడించాడు.

Advertisement

ఒకరోజు సినిమా షూటింగ్ ఆలస్యం అయిందని దాంతో తమన్నా ఉదయాన్నే జిమ్ కు వెళ్ళడం కుదరడం లేదని సీరియస్ అయ్యిందని చెప్పాడు. ఆ తరవాత రెండురోజుల పాటు ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవని అన్నారు. కానీ ఆ తరవాత సెట్ అయ్యిందని చెప్పాడు. ఇక తమన్నా ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్ కు రాలేకపోయింది అని క్లారిటీ ఇచ్చాడు.