దర్శక ధీరుడు రాజమౌళి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి రాజమౌళి అసలు ఎక్కడ పుట్టాడు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుది.
Advertisement
వాస్తవానికి రాజమౌళి పూర్వికులది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతం కావడంతో రాజమౌళి అక్కడే పుట్టి పెరిగాడు అని చాలా మంది అనుకుంటారు. తాజా ఈ విషయాన్ని ఓ నెటిజన్ రాజమౌళిని ప్రశ్నించడంతో ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
Also Read : మయోసైటిస్ నుండి కోలుకున్న తరవాత మరో సమస్యతో బాధపడుతున్న సమంత..అదేంటంటే..?
తాను అమరేశ్వర క్యాంపు, మాన్వి తాలుకా రాయచూరు జిల్లా కర్ణాటకలో జన్మించినట్టు పేర్కొన్నారు. తాను అమరేశ్వర క్యాంపు, మాన్వి తాలుకా రాయచూరు జిల్లా కర్ణాటకలో జన్మించినట్టు తెలిపారు. వాస్తవానికి వికీపీడియాలో కూడా ఇదే సమాధానం ఉందని అంటే.. కొవ్వూరులో జన్మించలేదు. కొవ్వూరు నుంచి వెళ్లి ఈ అమరేశ్వర క్యాంపులో స్థిరపడిన విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు ఆయన జన్మించారు. రాజమౌళి తండ్రి వి అయితే రాజమౌళికి మాత్రం ఎస్ ఎస్ అని ఉంటుంది. అది ఎందుకో మీరు గమనించారా..? ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
Advertisement
Also Read : ఈ నాలుగు రాశుల వారి వద్ధ సరిపడా డబ్బు ఉండదు.. అప్పుల పాలు కూడా..!
అసలు విషయమేమిటంటే.. రాజమౌళి తల్లిదండ్రులు శివ భక్తులు. ఒకసారి శ్రీశైలం ని దర్శించిన తరువాత రాజమౌళి జన్మించడంతో ఆయనకి శ్రీశైల శ్రీ రాజమౌళి అని నామకరణం చేశారు. రాజమౌలి తన ఇంటి పేరు వేసుకోకుండా ఎస్ ఎస్ రాజమౌళి అని సినిమాల్లో వేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి రాజమౌళి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగారు. కొవ్వూరులో రాజమౌళి తాతలకు వందల ఎకరాలు ఉండేవి. కానీ రైల్వే స్టేషన్ లైన్ కోసం భూముల సమీకరణ జరిపినప్పుడు వీరి కుటుంబానికి భారీగా నష్టం జరగడంతో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని నష్టపరిహారం తీసుకొని రాయిచూర్ జిల్లాకి వెళ్లిపోయారు. రాజమౌళి జన్మించిన తరువాత సుమారు నాలుగేళ్లకే కొవ్వూరు వచ్చారు. రాజమౌళి పుట్టిన ప్రదేశం వెనుక ఉన్న కథ ఇది.
Also Read : మంచు లక్ష్మి భర్త గురించి వచ్చిన ఆ వార్తలన్నీ నిజం కాదా..? అసలు మ్యాటర్ ఏంటంటే..?