Home » సీనియర్ నటి భానుప్రియ కూతురు ఎంత అందంగా ఉందంటే..?

సీనియర్ నటి భానుప్రియ కూతురు ఎంత అందంగా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 1980-90 లో దాదాపుగా దశాబ్ద కాలం పాటు ఓ రేంజ్ లో తన అందం,అభినయంతో మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్ భానుప్రియ.. అప్పట్లో ఈమె యువతకు కలల రాకుమారిగా ఉండేది.. అలాంటి భానుప్రియ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. అలాంటి భానుప్రియ అప్పట్లో తన నాట్యంతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేది. ముఖ్యంగా ఈమె నాట్యంలో మేటి నటి అని చెప్పవచ్చు..

Advertisement

also read;ఆ ఇద్దరు స్టార్ హీరోలకు సిల్క్ స్మిత అంటే పిచ్చి ప్రేమట.. కానీ చివరికి..!!

Advertisement

అలాంటి భానుప్రియ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ అయిన ఆదర్శ్ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఈమె పేరు అభినయా కౌశల్.. తన కూతురు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో తన భర్త నుంచి దూరంగా ఉంటుంది భానుప్రియ. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి రియంట్రీ ఇచ్చి తల్లి, వదిన,అత్త పాత్రల్లో నటిస్తోంది. అంతేకాకుండా భానుప్రియ గౌతమ్ ఎస్ఎస్సి, ఛత్రపతి, అన్నమయ్య వంటి సినిమాల్లో చేసి మంచి గుర్తింపు సాధించింది. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ భానుప్రియ కూతురు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం..

భానుప్రియ కూతురు అభినయ కౌశల్.. ఇప్పుడు 19 ఏళ్ల అమ్మాయి.. ఈమె కూడా తన తల్లిలాగే ఎంతో అందంగా ఉంటుంది.. ఈమె కూడా భానుప్రియ లాగే మంచి డాన్సర్. ఈమె చిన్నప్పటినుంచే డాన్స్ పై పట్టుతో ప్రాక్టీస్ చేసి మంచి డాన్సర్ గా మారింది. అలాంటి అభినయ ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరి ఈ అమ్మడు కూడా తల్లిలాగే హీరోయిన్ గా మెప్పిస్తుందా లేదా అనేది ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది.

also read;సినిమా అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే ? 

Visitors Are Also Reading