Home » టాలీవుడ్‌ ను షేక్ చేస్తున్న హనీ రోజ్… ఆమె వయసు ఎంతో తెలిస్తే, దిమ్మతిరగాల్సిందే !

టాలీవుడ్‌ ను షేక్ చేస్తున్న హనీ రోజ్… ఆమె వయసు ఎంతో తెలిస్తే, దిమ్మతిరగాల్సిందే !

by Bunty
Ad

 

వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. కాగా సీనియర్ బాలకృష్ణకు హనీరోజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు హనీరోజ్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది. కాగా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డిలో నటించే అవకాశం కల్పించారు.

Advertisement

ఈ సినిమా తర్వాత హనీరోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం హనీ రోజ్ తన అందచెందాలతో ప్రేక్షకులను మాయ చేయడమే. సినిమాలోనే కాకుండా సినిమా ఈవెంట్లలో హనీ రోజ్ సందడి చేసింది. దాంతో హనీ రోజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈమె ఫోటోలే వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Advertisement

ఇంత అందంగా తన లుక్ తో ప్రేక్షకులను మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వయసు 31 సంవత్సరాలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1991 సెప్టెంబర్ 5వ తేదీన కేరళలోని తోడుపూజ సైరో-మలబార్ కేతలిక్ కుటుంబంలో జన్మించింది. కమ్యూనికేటి ఇంగ్లీష్ లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని పూర్తి చేసిన 14వ ఏట యాక్టింగ్ కెరియర్ ను ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో ఈమెకు కావలసినంత పాపులారిటీ కూడా లభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading