మీ పెదాలు నల్లగా అయిపోయాయా..? అయితే ఇలా చేయండి. ఇలా చేస్తే పెదాలు గులాబీ రంగులో ఉంటాయి. అందంగా మెరిసిపోతాయి. స్మోకింగ్ ఎక్కువ చేయడం వలన చాలామంది పెదాలు పాడైపోతాయి. అలానే ఎండలో ఎక్కువ తిరగడం వలన కూడా పెదాలు బాగా పాడవుతాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పెదాల అందాన్ని పెంచుకోవచ్చు నల్లటి పెదాలని గులాబీ రంగులో మెరసేలా చేసుకోవచ్చు. పెదాలని అందంగా మార్చడానికి తేనె చక్కెర బాగా పనిచేస్తాయి. మృత చర్మాన్ని ఇది తొలగిస్తుంది. అలానే మంచి ఫలితాన్ని ఇస్తుంది.
Advertisement
Advertisement
చక్కెర తేనే కలిపి స్క్రబ్ చేసుకుంటే పెదాల మీద మృత కణాలు తొలగిపోతాయి సహజంగా మెరిసే మృదువైన పెదవుల్ని ఇది అందిస్తుంది. పెదాల మీద సున్నితంగా మాత్రమే మసాజ్ చేయండి బాగా గట్టిగా రుద్దకండి. కొబ్బరి నూనె కూడా పెదాల అందాన్ని పెంచుతుంది. పెదాలపై కొబ్బరి నూనె రాస్తే మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. పెదాలు పొడిబారి పోకుండా ఉంటాయి. అలానే హైడ్రేట్ గా ఉంటాయి. కలబంద గుజ్జు కూడా పెదాల మీద రాసుకోవచ్చు పెదాల మీద కలబంద గుజ్జు రాసుకుంటే కూడా పెదాలు అందంగా మెరుస్తాయి. కీర దోస రసాన్ని కూడా పెదాల మీద రాసుకోవచ్చు. ఇలా పెదాలని అందంగా మార్చుకోవచ్చు మరి ఈసారి నల్లని పెదాలు కలవారు ఇలా చేసి చూడండి.
Also read:
- వేప ఆకులతో జుట్టు సమస్యలు దూరం..!
- ఉదయాన్నే వీటిని తినండి.. బరువు తగ్గచ్చు..!
- Kushi Movie Review : ఖుషి సినిమా రివ్యూ.. సమంతను విజయ్ నలిపేశాడా ?