ఒక్కొక్కసారి ఆగకుండా ఎక్కిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళని తగ్గించుకోవడానికి చాలా మంది నీళ్లు తాగడం లేదంటే ఏవేవో పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా ఎక్కిళ్ళు తగ్గవు. ఎక్కిళ్ళు తగ్గకుండా కంటిన్యూస్ గా వస్తున్నట్లయితే ఇలా చేయడం మంచిది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూలింగ్ వాటర్ తాగితే ఎక్కిళ్లు త్వరగా తగ్గిపోతాయి. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు మజ్జిగ తాగితే కూడా ఎక్కిళ్ళు త్వరగా తగ్గుతాయి. కొంచెం పెరుగు తీసుకుని అందులో బాగా నీళ్లు కలిపి పల్చగా తాగితే ఎక్కిళ్లు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
Advertisement
Advertisement
ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఐస్ క్యూబ్ తీసుకుని నోట్లో వేసుకోండి ఈ ఐస్ క్యూబ్ నుండి వచ్చే నీళ్ళని కొంచెం కొంచెం తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఒక స్పూన్ చక్కెర తీసుకొని నోట్లో వేసుకోండి. అప్పుడు కూడా త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఒకసారి శ్వాసని బిగపెట్టి ఉంచండి తర్వాత డీప్ గా శ్వాస తీసుకోండి ఇలా చేస్తే ఎక్కిళ్ల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది పీనట్ బెటర్ తింటే కూడా ఎక్కిళ్లు తగ్గిపోతాయి. మిరియాల పొడిని కొంచెం వాసన చూస్తే కూడా ఎక్కిళ్ళ నుండి త్వరగా బయటపడొచ్చు.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి
- రణ్ బీర్ కపూర్ చేసిన ఆ త్యాగం దాని కోసమేనా..?
- వైజయంతీ మూవీస్ వార్నింగ్.. ‘మెగా 157’ నిలిచిపోయినట్టేనా..?