Home » ఆడపిల్లలని తండ్రి వదిలేసాడు.. కష్టపడి చదివి 10జిపిఏ సాధించారు..!!

ఆడపిల్లలని తండ్రి వదిలేసాడు.. కష్టపడి చదివి 10జిపిఏ సాధించారు..!!

by Sravanthi
Ad

టాలెంట్ ఉండాలి కానీ ఎలాంటి కష్టం అయినా అధిగమించవచ్చని నిరూపించారు ఈ ఆడపిల్లలు. ఈరోజుల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఆడపిల్లలపై వివక్ష చూపిస్తున్నారు. ఆడపిల్లలు పుడితే వారిని చాలా దారుణంగా చూస్తున్నారు. అలా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భార్యను పుట్టింటికి పరిమితం చేశాడు ఓ భర్త. అయినా ఆమె వెనకడుగు వేయకుండా ఇద్దరు పిల్లలను చదివించింది. 10లో వారి సత్తా చాటారు.. పూర్తి వివరాలు చూద్దాం.. కవల ఆడపిల్లలు పుట్టారని తండ్రి వదిలిపెట్టాడు.

also read:ఓటీటీలో ఆది మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..!

Advertisement

ఆ ఇద్దరు పిల్లలను అమ్మమ్మ, తాతయ్యలే చేరదీసి చదివించారు. వారి శ్రమ వృధా కాలేదు పిల్లలు కూడా కష్టపడి చదివి ఎస్ఎస్సి ఫలితాల్లో 10 జిపిఏ సాధించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవ పట్నానికి చెందిన రిటైర్ ఉద్యోగి అల్లంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్ లో ఔట్సోర్సింగ్ లో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా పనిచేస్తున్నారు. పదహారేళ్ల క్రితం కవితకు ఏడో నెల టైం లో డెలివరీ కోసం ఆమె భర్త పుట్టింటికి పంపాడు. ఆమెకు కవల ఆడపిల్లలు పుట్టడంతో ఆ భర్త ఆమెను ఇక్కడే వదిలేశాడు.

Advertisement

also read:ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. 37 దేశాల్లో విడుదలకు సిద్ధం..!

అప్పటినుంచి ఆమె వారి ఆలనా పాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూసుకుంటూ వస్తున్నారు. ఇద్దరు శార్వాణి, ప్రజ్ఞాని ఐదో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో, ఇక ఆరో తరగతి నుంచి మోడల్ స్కూల్లో చదివారు. బుధవారం విడుదల చేసినటువంటి పదవతరగతి ఫలితాల్లో ఇద్దరు 10 జిపిఏ సాధించి రికార్డు క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆ ఆడపిల్లలు మాట్లాడుతూ అమ్మమ్మ తాతయ్యలు ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతో కష్టపడి చదివి 10 జిపిఏ సాధించామని తెలియజేశారు.

also read:పిల్లలకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!

Visitors Are Also Reading