పాకిస్తాన్ దేశంలో ముస్లిం జనాభే అధికంగా ఉన్న విషయం విధితమే. అయితే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నపాకిస్తాన్ దేశంలో హిందువులు కూడా మైనార్టీ వర్గంలో ఉన్నారు అక్కడ. ముఖ్యంగా హిందూ- ముస్లిం అంశంతో స్వాతంత్రోద్యమం సమయంలోనే పాకిస్తాన్- భారత్ రెండు వేరు వేరు దేశాలుగా విడిపోయాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కేవలం ముస్లిం జనాభా ప్రాతిపదికనే సపరేట్ దేశంగా ఏర్పడింది. అలాంటి దేశంలో ఒక హిందూ ప్రార్థన స్థలాన్ని భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తుంటారు.
Also Read: జాగ్రత్త….మహిళకు మిడిల్ ఫింగర్ చూపిస్తే ఆరు నెలలు జైలుశిక్ష…!
Advertisement
పాకిస్తాన్‌లో జరిగే పూజా కార్యక్రమాలు, నిర్వహించే ఉత్సవాలలో హిందువులతో పాటు.. ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటుంటారు. వివరాల్లోకి వెళ్లితే.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో హింగ్‌లాజ్ మాతా మందిర్ దేవాలయం కలదు. బలూచిస్తాన్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో హింగ్లూ నది తీరాన వెలసిన అమ్మవారి దేవాలయం చాలా మహత్యం కలదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ దేవాలయం అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటి కూడా వారు నమ్ముతారు. ముస్లింలు ఈ దేవాలయాన్ని ఒక తీర్థ స్థలంగా భావించి అక్కడ జరిగే పూజలకు భారీ సంఖ్యలో వస్తుంటారు.
Advertisement
అక్కడ ఈ శక్తి పీఠాన్ని నానికా మందిర్ అని పిలుస్తుంటారు. పాకిస్తాన్‌లో ఈ ఆచారం తరతరాలుగా వస్తున్నదని అక్కడి ముస్లింలు పేర్కొంటున్నారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో మాతా సతి శరీరాన్ని 51 భాగాలుగా చేసారని, ఆ భాగాలు ప్రపంచంలో పలు ప్రదేశాల్లో ఉన్నాయట. హింగ్ లాజ్ ప్రదేశంలో మాతా సతి చేయి పడడంతో ఈ ప్రదేశంలో కూడా ఒక శక్తి పీఠం ఏర్పాటు అయిందని, అది హింగలాజ్ దేవాలయంగా కొన్ని శతాబ్దాలుగా ప్రాచుర్యం పొందిందని వారి పూర్వికులు పేర్కొన్నారని స్థానికులు చెబుతున్నారు.
Also Read: “ఆర్ఆర్ఆర్” లోగోలో చరణ్ ఫోటో ముందు పెట్టడానికి కారణం చెప్పిన జక్కన్న…!