Home » జాగ్రత్త….మహిళకు మిడిల్ ఫింగర్ చూపిస్తే ఆరు నెలలు జైలుశిక్ష…!

జాగ్రత్త….మహిళకు మిడిల్ ఫింగర్ చూపిస్తే ఆరు నెలలు జైలుశిక్ష…!

by AJAY
Ad

విదేశాల్లో గొడవలు జరిగినప్పుడు ఆవేశంలో మిడిల్ ఫింగర్ ను చూపించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ విష సంస్కృతి మన దేశంలో కూడా కనిపిస్తుంది. సినిమాలు చూసో లేదంటే ప్రాశ్చాత్య పొకడలో గానీ ఈ సంస్కృతి మన దేశానికి కూడా పాకింది. ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందిన ఓ వ్యక్తి మహిళలతో గొడవ అవ్వడం వల్ల ఆమెకు మిడిల్ ఫింగర్ చూపించాడు. దాంతో అతడికి కోర్టు ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే…. 2018 సెప్టెంబర్ 17 వ తేదీన అనికేత్ పాటిల్ వ్యక్తి….66 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుతో గొడవకు దిగాడు.

Advertisement

ముంబై లో మహిళ తన కుమారుడితో ఆఫీస్ కి వెళ్తూ క్యాడ్బరీ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఎడమ వైపు నుండి రెడ్ కలర్ కార్ వచ్చి డివైడర్ రెండు వైపు వెళ్లేలా మీదకు వచ్చాడు. వంద మీటర్ల వరకు అలా వస్తూనే ఉన్నాడు. దాంతో వాళ్ళు తప్పించుకొని ముందుకు వచ్చి సిగ్నల్ వద్ద ఆగారు. అయినా సరే టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తూ కార్ విండో ఓపెన్ చేసి తిట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె కొడుకు కార్ అడ్డుపెట్టి పాటిల్ తో గొడవకు దిగాడు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు.

Advertisement

Also read :కార్పొరేట్ సీఈవోల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న విరుష్క బాడీగార్డు..ఎంతంటే..?

ఈ వాదనలో మహిళకు పాటిల్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సెక్షన్ 354 ఎ, 345 డి, 509 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో తాజాగా తీర్పు ఇచ్చిన కోర్టు ప్రతి మహిళకు సమాజంలో డిగ్నిటీ తో బ్రతికే హక్కు ఉందని… వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఏం చేసినా సమాజానికి తప్పుడు సందేశం అందుతుందని మెజిస్ట్రేట్ వెల్లడించారు. అదేవిధంగా పాటిల్ కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Visitors Are Also Reading