Telugu News » “ఆర్ఆర్ఆర్” లోగోలో చరణ్ ఫోటో ముందు పెట్టడానికి కారణం చెప్పిన జక్కన్న…!

“ఆర్ఆర్ఆర్” లోగోలో చరణ్ ఫోటో ముందు పెట్టడానికి కారణం చెప్పిన జక్కన్న…!

by AJAY
Ad

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ముంబై, బెంగళూరులో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన చిత్ర బృందం శనివారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాజమౌళికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగోలో మొదట “ఆర్” పై రామ్ చరణ్ బొమ్మ…. చివరి “ఆర్” పై ఎన్టీఆర్ బొమ్మ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో ఆర్ పై ఇద్దరూ చేతులు కలిపిన బొమ్మ కనిపిస్తుంది. అయితే మొదటి ఆర్ అనే అక్షరం పై చరణ్ బొమ్మను పెట్టడానికి కారణం ఆయన సినిమాలో పెద్దవాడు కావడమా.? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

Advertisement

Advertisement

దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ అలా ఆలోచించి పెట్టలేదని అయినా చరణ్ కంటే ఒక సంవత్సరం ఎన్టీఆర్ పెద్దవాడు అని చెప్పారు. దాంతో వెంటనే ఎన్టీఆర్ మైక్ తీసుకుని ఇప్పుడు నా వయసు గురించి అవసరమా.. అడిగింది మా వయసు గురించి కాదు మేం పోషించిన పాత్రల వయసు గురించి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దాంతో రాజమౌళి ప్రశ్నను సరిగా అర్థం చేసుకుని ఆసక్తికర సమాధానమిచ్చాడు.

అసలు రామ్ చరణ్ బొమ్మ ముందు ఎక్కడ ఉంది.. అంటూ ఎదురు ప్రశ్నించారు. చరణ్ బొమ్మ వెనక.. ఎన్టీఆర్ బొమ్మ ముందు ఉందని… ఎన్టీఆర్ ను చూస్తూ వెనకాల రామ్ చరణ్ ఉన్నాడని చెప్పాడు. దాంతో ఇప్పటి వరకు ముందు ఆర్ పై రామ్ చరణ్ బొమ్మ ఉంది అనుకున్న వారంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేయగా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

Visitors Are Also Reading