Home » ఐపీఎల్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్లు వీళ్ల‌వే..!

ఐపీఎల్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్లు వీళ్ల‌వే..!

by Anji
Ad

అత్యంత త్వ‌ర‌లోనే అన‌గా మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం అవుతున్న విష‌యం తెలిసిందే. ఆయా జ‌ట్ల ఆట‌గాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. ప్ర‌తి సీజ‌న్ మాదిరిగానే ఈసారి కూడా బ్యాట‌ర్లు వారి ప‌రుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఈ లీగ్‌లో కొంద‌రూ బ్యాట‌ర్లు ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై విరుచుకుప‌డి భారీ ఇన్నింగ్స్ లు ఆడారు. ఈసారి కూడా ప్లేయ‌ర్స్ ఇలాంటి ఇన్నింగ్స్‌నే ఆడాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు లీగ్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు సాధించిన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

Advertisement

క్రిస్ గేల్ (175)

ఐపీల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో వెస్టిండిస్ విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ క్రిస్‌గేల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 2013 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌రుపున గేల్ పుణేతో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో 175 ప‌రుగులు సాధించాడు. కేవ‌లం 30 బంతుల్లోనే ఇత‌ను సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 130 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

Also Read : ఐపీఎల్ కు పాకిస్తాన్ స‌వాల్‌.. ఎవ‌రు ఆడ‌తారో చూస్తామంటూ..!

బ్రెండ‌న్ మెక్‌క‌ల‌మ్ (158)

ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ తొలి మ్యాచ్‌లోనే విజృంభించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌క‌ల‌మ్‌. కోల్‌క‌తా నైట్ రైడర్స్ త‌రుపున ఆడిన ఇత‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 158 ప‌రుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్‌లో మెక్‌క‌ల‌మ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో కోల్‌క‌తా 140 ప‌రుగుల భారీ తేడాతో గెలిచింది.

Advertisement

ఏబీ డివిలియ‌ర్స్ (133)

2015 ముంబ‌యి ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ 59 బంతుల్లో 133 ప‌రుగులు చేసి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఈ త‌రుణంలోనే విరాట్ కోహ్లీ (82)తో క‌లిసి 215 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు మిస్ట‌ర్ 360. 19 ఫోర్లు, 4 సిక్స్‌లున్నాయి.  ఏబీడీ ఇన్నింగ్స్ తో మ్యాచ్‌లో ఆర్సీబీ 39 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

2016 సీజ‌న్‌లో భాగంగా గుజ‌రాత్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏబీడీ 52 బంతుల్లో 129 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 12 సిక్స్‌లున్నాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 109 ప‌రుగులు చేశాడు. గుజ‌రాత్ జ‌ట్టును 104 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసిన కోహ్లీ సేన 144 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

కేఎల్ రాహుల్ (132)

2020 సీజ‌న్ యూఏఈవేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టు కెప్టెన్ కే.ఎల్‌. రాహుల్ ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 132 ప‌రుగులు సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ చరిత్ర‌లో ఓ భార‌తీయ ఆట‌గాడి వ్య‌క్తిగ‌త అత్య‌ధిక స్కోరు ఇదే కావ‌డం విశేషం.న ఇందులో 14 ఫోర్లు, 7 సిక్స్‌లున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 97 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.

Also Read : Sunrisers Hyderabad : కేన్ విలియ‌మ్స‌న్‌ గాయం ఫేక్.. సన్​రైజర్స్​ సందడి

Visitors Are Also Reading