టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పేర్గాంచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మగధీర, బాహుబలి సిరీస్, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు భారతదేశంలో ఏరేంజ్‌లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఒకే సంవత్సరంలో ఎక్కువ సినిమాలు తీసిన టాలీవుడ్ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
జగపతిబాబు
జగపతిబాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. ఇతను తెలుగు సినీ నిర్మాత దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాల్లో నటించి 7 నంది పురస్కాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. ఇక 1987లో జగపతి బాబు 07 సినిమాల్లో నటించారు.
బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఈయన తెలుగు సినిమా నటుడు. మరొకవైపు నిర్మాత, శాసనసభ్యుడు కూడా. వైవిద్యభరితమైన పాత్రలను పోషించడమే కాకుండా.. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో బాలకృష్ణ నటించాడు. తన సినీ జీవితంలో ఎన్నో తెలుగు సినిమాలను చేయడం వల్ల తెలుగు వారికి సుపరిచితుడు. అయితే నందమూరి బాలకృష్ణ 1987లో 07 సినిమాల్లో నటించారు.
అల్లరి నరేష్
తెలుగు సినిమా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వితీయ కుమారుడు అల్లరి నరేష్. అల్లరి అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. దీంతో అప్పటి నుంచి అల్లరి నరేష్ గా పేర్గాంచాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్‌గా పేరుపొందాడు. ఇక అల్లరి నరేష్ 2008లో 08 సినిమాల్లో నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా గుడివాడ తాలుకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలల్లో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. మద్రాస్ నుంచి హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ రావడానికి నాగేశ్వరరావు కృషి ఎనలేనిది. 1960లో 9 సినిమాల్లో నటించారు.
శోభన్‌బాబు
Advertisement
శోభన్ బాబు ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో అతను ఒక విశిష్టమైన సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. 1980 సంవత్సరంలో 12 సినిమాల్లో నటించారు.
చిరంజీవి
తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ఏళ్ల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. ముఖ్యంగా తన బ్రేక్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. 150కి పైగా చిత్రాల్లో నటించారు. 1980లో చిరంజీవి ఎక్కువగా 14 సినిమాల్లో నటించారు.
రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాల్లో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇతను 1988 చిత్రంలో రాజేంద్రప్రసాద్ 17 చిత్రాల్లో నటించాడు.
కృష్ణంరాజు
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. జనవరి 20, 1940లో జన్మించారు. 1970,1980ల్లో 183 తెలుగు సినిమాల్లో నటించాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈయన 1974 సంవత్సరంలో 17 సినిమాల్లో నటించాడు.
ఎన్టీఆర్
ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినీ కెరీర్‌లో ఎన్టీఆర్ చేయని పాత్ర అంటూ లేదు. అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీఆర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ 1964 లో 17 సినిమాల్లో నటించారు.
కృష్ణ
ఘట్టమనేని కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివ రామకృష్ణ మూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970, 1980లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్ గా ప్రఖ్యాతి పొందాడు. 1972లో 18 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు కృష్ణ.
Also Read :
“సర్కారువారిపాట” లో జనసేనను టార్గెట్ చేశారా….? గాజు గ్లాసు సీన్ పై పవన్ ఫ్యాన్స్ అనుమానాలు…!
“జబర్దస్త్” లోకి ఎంట్రీ ఇవ్వకముందు “హైపర్ ఆది” ఏ పని చేసేవారో తెలుసా ?