Home » “జబర్దస్త్” లోకి ఎంట్రీ ఇవ్వకముందు “హైపర్ ఆది” ఏ పని చేసేవారో తెలుసా ?

“జబర్దస్త్” లోకి ఎంట్రీ ఇవ్వకముందు “హైపర్ ఆది” ఏ పని చేసేవారో తెలుసా ?

by Sravanthi Pandrala Pandrala
Ad

జబర్దస్త్ పేరు వింటేనే మనకు నవ్వు వస్తుంది. అలాంటి షో ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందింది. ఈ షో ద్వారా కమెడియన్స్ ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించి సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అంతే వివాదాల్లో కూరుకుపోయింది.

Hyper Aadi

Advertisement

Advertisement

ఈ షోలో ముఖ్యంగా డబల్ మీనింగ్ డైలాగ్స్ అతిగా ఉన్నాయనేది వాస్తవం. ఈ డైలాగ్స్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది. హైపర్ ఆది డైలాగ్స్ కోసం చాలామంది చూసేవారు. సందర్భాన్ని బట్టి ఆది వేసే పంచులు ప్రేక్షకులను చాలా నవ్వించేవి. అయితే ఆది కాస్ట్యూమ్స్ కూడా చాలా వెరైటీ గా ఉండేవి. ఆయన జబర్దస్త్ కు రాకముందు ఏం చేసేవాడు ఓ సారి చూద్దాం..!! బీటెక్ పూర్తి చేసిన ఆది దర్శకుడు త్రివిక్రమ్ మరియు సిరివెన్నెల పై పేరడీ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత జబర్దస్త్ లోని టీం లీడర్ అదిరే అభి తో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లోని పల్లమల్లి లో జన్మించి చిన్ననాటినుండే కామెంట్స్, జోక్స్ వేసేవాడు.ఇప్పుడు ఆ పంచులే ఆది కి మంచి రేంజ్ ని తీసుకొచ్చాయని చెప్పవచ్చు. అయితే అంతకు ముందు జబర్దస్త్ లో ఆది కి పారితోషికం రెండు లక్షల వరకు ఇచ్చేవారట. అంతేకాకుండా చాలా సినిమాల్లో ఆది నటించారు. హైపర్ ఆది యొక్క డైలాగ్స్ స్క్రీప్ట్ కు మాటల మాంత్రికుడు కూడా మెచ్చి పిలిచి మరీ అవకాశాలు కల్పించారట.

ALSO READ;

“జబర్దస్త్” శాంతి స్వరూప్ ని హైపర్ ఆది టీం అంతలా అవమానించారా ?

అలాంటి వీడియోలు చేస్తున్నాడు అంటూ యూట్యూబర్ పై కరాటే కల్యాణి దాడి…వీడియో వైరల్…!

Visitors Are Also Reading