తెలుగు సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 100 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం కావడంతో యావత్ దేశం ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వపడుతోంది. మొదటినుండి ఆర్ఆర్ఆర్ కు ఏదో ఒక విభాగంలో ఆస్కార్ పక్క అని విశ్లేషకులు అంచనా వేశారు.
Advertisement
అనుకున్నట్లే, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ లభించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులుగా నటించారు. వారి మధ్య బాండింగ్, వారి మధ్య వచ్చిన దూరం, వారి స్నేహాన్ని ఎలా గెలిపించుకున్నారు.. ఇవన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి. చివరకు ఆ పాత్రలలో వారిని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేము అన్నట్లుగా ఈ సినిమాకు కనెక్ట్ అయిపోయారు. కానీ, అసలు ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు ఈ పాత్రల కోసం అనుకున్న హీరోలు వేరేవాళ్లట.
Advertisement
రాజమౌళి ఎప్పుడైనా ఎవరితో అయితే సినిమా తీయాలని కథ సిద్ధం చేసుకుంటారో వారితో మాత్రమే తీస్తారు. అది కుదరకపోతే, ఆ కథని వదిలేస్తారు. ఈ విషయాన్ని రాజమౌళినే చాలా సార్లు చెప్పారు. అయితే, ఆర్ ఆర్ ఆర్ విషయంలో అలా జరగలేదు. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే చెప్పారు. ఆయన తొలుత కథ రాసుకున్నప్పుడు రజనీకాంత్, అర్జున్ లను అనుకున్నారట. తర్వాత సూర్య, కార్తీ లు అయినా సూట్ అవుతారనుకున్నారట. చివరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఎంచుకున్నారు. వీరిద్దరినీ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే.. వారి మధ్య ఉన్న స్నేహం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చే కాదు.. లాక్కునేది.. ఆసక్తి రేపుతున్న స్పై మూవీ ట్రైలర్
విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?