ఒకప్పుడు హీరోయిన్లుగా నటించిన చాలా మంది భామలు ప్రస్తుతం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. అయితే కొంతమంది హీరోయిన్ లు ఇండియాలో ఉంటే చాలా మంది సీనియర్ హీరోయిన్ లు విదేశాల్లో సెటిల్ అయ్యారు. అలా విదేశాల్లో స్థిరపడిన హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం….బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకోవడంతో పాటూ అమెరికాకు మకాం మార్చింది.
ALSO READ : ఈ సినిమా కోసం చిరును దారుణంగా అవమానించారు.. అందుకే మూవీ హిట్టాయిందా.?
Advertisement
అంతే కాకుండా టాలీవుడ్ హీరోయిన్ లయ అంటే గుర్తుపట్టని వారు ఉండరు. ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా రానించిన ఈ నటి ప్రస్తుతం పెళ్లి చేసుకుని భర్తతో పాటూ విదేశాల్లో స్థిరపడింది.
తెలుగులో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్వాతి ఆ తరవాత సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సినిమాలకు దూరమైన ఈ నటి ప్రస్తుతం పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది.
Advertisement
మిర్చి, మిరపకాయ్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన రిచా గంగోపాద్యాయ సినిమాలకు గుడ్ బై చెప్పి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. అంతే కాకుండా అక్కడే పెళ్లి చేసుకుసి స్థిరపడింది. నా ఆటోగ్రాఫ్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ గోపిక…ఈ ముద్దుగుమ్మ సినిమాకు గుడ్ బై చెప్పిన తరవాత ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా విదేశాల్లోనే స్థిరపడింది. వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకున్న రంభ టొరంటోలో ఫ్యామిలీతో కలిసి ఉంటుంది.అంతే కాకుండా హీరోయిన్ అంకిత, కీర్తిరెడ్డి, అన్షు అంబానీ సహా మరికొందరు ముద్దుగుమ్మలు కూడా పెళ్లి తరవాత విదేశాల్లో స్థిరపడ్డారు.
ALSO READ : Nani: దసరా లాంటి మూవీ మరోసారి చేయను..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?