Home » Nani: దసరా లాంటి మూవీ మరోసారి చేయను..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Nani: దసరా లాంటి మూవీ మరోసారి చేయను..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం థియేటర్లలో దసరా మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ గురించి నాచురల్ స్టార్ నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఫార్ములా సక్సెస్ అయితే దాన్ని అనుసరించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మరోసారి సక్సెస్ అందుకోవచ్చు అని వారి భావన. అయితే బాహుబలి సినిమా తర్వాత అలాంటి సినిమాలే చేయాలని కొందరు భావించి ఘోర పరాజయం పాలయ్యారు.

also read:April 4th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

అందుకే ఒకే ఫార్ములాని పదే పదే రిపీట్ చేయకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉండాలని నాని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నేను ఉద్దేశపూర్వకంగా ఏది కూడా ప్లాన్ చేసుకోనని దసరా మూవీ కూడా నేను ప్లాన్ చేసింది కాదని స్పష్టం చేశారు. తనకు నచ్చింది కాబట్టి చేసుకుంటూ పోయానని తెలియజేశారు. నేను ఒకే జోనార్ కు కట్టుబడి ఉంటానని, ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించాలనుకుంటానని పేర్కొన్నారు. ఇప్పుడు దసరా మూవీ ఘనవిజయం సాధించింది కదా అని మళ్లీ అలాంటి సినిమా వైపు నేను మరోసారి వెళ్లను అంటూ కుండ బద్దలు కొట్టాడు.

Advertisement

also read:IPL 2023 : సిక్సుతో కారు ధ్వంసం..గైక్వాడ్ కు రూ.5 లక్షల రివార్డు

ఒకవేళ భవిష్యత్తులో మరో మాస్ సినిమా చేయొచ్చు ఏమో కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం అలాంటి సినిమా వైపు అస్సలు పోనని క్లారిటీ ఇచ్చాడు. దసరా మూవీ హిట్ అయినందుకు సంతోషంగా ఉన్నానని.. కానీ సాటిస్ఫై అవ్వలేదని బాంబు పేల్చాడు. ఒకవేళ సాటిస్ఫై అయితే మాత్రం తను సోమరిపోతునవుతానని, మరో సినిమాలో బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు.. ఈ సినిమా విజయం చిత్ర యూనిట్ అందరిదని అన్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ రావడం నాకు ఆనందాన్ని ఇస్తుందని తెలియజేశారు.

also read:అందాల సిమ్రాన్ ఇలా మారడం వెనుక అసలు కారణం..!!

Visitors Are Also Reading