ప్రేమ ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో తెలియదు. ప్రేమకు అందచందాలు…వయస్సు తో సంబంధంలేదు. ప్రేమ ఎప్పుడు ఎవరిపైన అయినా కలగొచ్చు. అలానే కొంతమంది తమకంటే చిన్న వయసు వాళ్లను పెళ్లాడతారు. అయితే సాధారణంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునే జంటలో అబ్బాయి వయసుకంటే అమ్మాయి వయసు తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రూల్ ను పెద్దగా పట్టించుకోవడంలేదు. తమకంటే చిన్నవారిని కూడా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇక సాధారణ ప్రజలే కాకుండా హీరోయిన్లు సైతం తమకంటే చిన్న వయసున్న హీరోలను పెళ్లాడుతున్నారు.
Advertisement
అలా టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా కొంతమంది హీరోయిన్ లు తమకంటే చిన్న వయసు కలిగిన హీరోలను పెళ్లాడారు. ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం…టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసులో తనకంటే పెద్దది అయిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ ఈ జంట అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. వంశీ సినిమా షూటింగ్ సమయంలో మహేశ్ బాబు నమ్రత ఒకరొనొకరు ప్రేమించుకున్నారు.
Advertisement
ఇక ప్రపంచ సుంధరి ఐశ్వర్యరాయ్ కూడా వయసులో తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యారాయ్ రెండేళ్లు పెద్దది కావడం విశేషం. అంతే కాకుండా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి ప్రస్తుతం హాలీవుడ్ ను షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా కూడా వయసులో తనకంటే చిన్నవాడైన నిక్ జోనాస్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరిదీ కూడా ప్రేమ వివాహమే కావడం విషేశం.
అంతే కాకుండా ప్రియాంక చోప్రా కంటే నిక్ జోనాస్ ఏకంగా పదకొండేళ్లు చిన్నవాడు కావడం అవాక్కయ్యే విషయమే అని చెప్పాలి.
మరోవైపు అనుష్క శర్మ కంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆరు నెలలు చిన్నవాడు. సైఫ్ అలీఖాన్ కూడా తనకంటే పదమూడు సంవత్సరాలు పెద్దదైన అమృతాసింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకున్నారు.
Advertisement
Also Read: కన్నడ నీరాజనం.. పునీత్‌రాజ్‌కు కర్నాటక రత్న అవార్డు