Home » క‌న్న‌డ నీరాజ‌నం.. పునీత్‌రాజ్‌కు కర్నాటక రత్న అవార్డు

క‌న్న‌డ నీరాజ‌నం.. పునీత్‌రాజ్‌కు కర్నాటక రత్న అవార్డు

by Sravan Sunku
Ad

క‌న్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఇప్పటికీ ఆయ‌న‌ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ గుండెల్లో గూడు కట్టుకున్న క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌కు అంతే స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన సంతాప సభలో ప్రభుత్వ పెద్దలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సంతాప సభలో పలువురు కన్నడ నటీ నటులతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమల ప్రముఖులు కూడ పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మక అవార్డును క‌ర్నాట‌క‌ సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు . దేశంలోనే పవర్‌ఫుల్‌ అవార్డ్‌ అయిన కర్నాటక రత్న అవార్డును పునీత్‌కు నివాళిగా ఇస్తున్నట్లు సీఎం వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

బెంగళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా కర్ణాటక రత్న అవార్డును పునీత్ రాజ్ కుమార్‌కు ప్రకటించారు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. పునీత్ మా అందరికీ ప్రియమైన నటుడు అని, తను చిన్నప్పటి నుంచి నాకు తెలుసని, కర్ణాటక నుంచి బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక బాలుడు పునీత్ అని వివ‌రించారు. పునిత్ చిన్న‌నాటి నుంచే అద్భుతంగా నటించేవాడు. ఇంత చిన్న వయసులో అలా నటించడం అంత సులువు కాదు అని బొమ్మై స్ప‌ష్టం చేశారు.

భార‌త ర‌త్న జాతీయ స్థాయిలో అత్యున్న‌త పుర‌స్కారం అయితే.. క‌ర్నాట‌క ర‌త్న ఆ రాష్ట్ర స్థాయిలో అత్యున్న‌త పుర‌స్కారం కావ‌డం గ‌మ‌నార్హం. విశేష కృషి చేసిన వ్య‌క్తుల‌కు మాత్ర‌మే రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డును క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించారు. సిని నటుల‌కు కేవ‌లం ఎనిమిది మందికి మాత్రమే కర్ణాటక రత్న అవార్డు లభించింది. మరణానంతరం ఈ అవార్డును అందుకున్న 10వ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ నిలిచాడు. క‌ర్నాట‌క ర‌త్న అవార్డులో 50 గ్రాముల బంగారు పతకం, కృతజ్ఞత పత్రం అంద‌జేస్తారు.

 

Visitors Are Also Reading