Home » చిరంజీవి భార్య వ‌ల్ల రాశి స్టార్ హీరోయిన్ అయ్యిందా…? ఎవ్వ‌రికీ తెలియ‌ని స్టోరీ..!

చిరంజీవి భార్య వ‌ల్ల రాశి స్టార్ హీరోయిన్ అయ్యిందా…? ఎవ్వ‌రికీ తెలియ‌ని స్టోరీ..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో గోకులంలో సీత సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా కుర్రాళ్ల‌తో పాటూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు సైతం తెగ న‌చ్చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి న‌టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో రాశిని హీరోయిన్ గా ఎంపిక చేయ‌డానికి అస‌లు కార‌ణం చిరంజీవి స‌తీమ‌ణి సురేఖన‌ట‌.

Advertisement

దానికి కార‌ణం రాశికి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న అనుబంధ‌మే. చిరంజీవి హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ హిందీ రీమేక్ లో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించారు. అలా రాశికి చిరంజీవి కుటుంబంతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. కాగా చిరంజీవి త‌న భార్య స‌రేఖ‌తో క‌లిసి ఓసారి చెన్నై కి వెళ్లారు. రాశి కుటుంబ స‌భ్యులు కూడా అప్పుడు చెన్నై లో ఉండేవార‌ట‌.

Advertisement

ఇక చెన్నై వెళ్లిన చిరంజీవి నుండి రాశి తండ్రికి ఫోన్ వెళ్లింద‌ట‌. దాంతో రాశి తండ్రి ఆమె ఫోటోల‌తో చిరును క‌లిసేందుకు వెళ్లాడ‌ట‌. అక్క‌డ సురేఖ కూడా ఉండ‌టంతో రాశి అందం చూసి ఈ హీరోయిన్ అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న బాగుంటుంద‌ని చెప్పింద‌ట‌. దాంతో చిరంజీవి కూడా ఓకే చెప్పారు.

 

ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు వెస్ట్ర‌న్ వేర్ లో ఫోటోలు తీసి ఆ త‌ర‌వాత ఫైన‌ల్ చేశార‌ట‌. అలా సురేఖ రిక‌మెండేష‌న్ తో రాశికి ప‌వ‌న్ క‌ల్యాణ్ తో నటించే ఛాన్స్ ద‌క్కింది. ఆ త‌ర‌వాత రాశి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అందాల రాశిగా పేరు సంపాదించుకుంది. ఇక ఇప్ప‌టికీ రాశి న‌ట‌న‌కు స్వ‌స్తి చెప్ప‌కుండా సీరియ‌ల్స్ లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Visitors Are Also Reading