Home » హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లి ఫిక్స్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లి ఫిక్స్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

by Bunty
Ad

రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించగల సామర్థ్యం ఉంది ఈ బ్యూటీకి. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది అభిమానుల మనసులను కొల్లగొట్టింది. తన సినిమాలతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులను దోచుకుంది ఈ భామ. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఇక ఈ విషయంపై సెర్చ్ చేయగా… నిజంగానే రకుల్ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతుందని సమాచారం అందుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిందట ఈ అమ్మడు. ఇప్పటికే రకుల్ వారి ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పేసిన రకుల్ తన ప్రియుడితో కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు, సినిమాలకు కలిసి వెళ్ళేది.

Advertisement

ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన గోవాలో ఓ ప్రముఖ రిసార్ట్ లో రకుల్, జాకీల వివాహం అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగబోతుందట. ఇక వివాహ అనంతరం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం స్పెషల్ గా రిసెప్షన్ ని ఏర్పాటు చేయబోతున్నారట రకుల్, జాకి. ప్రస్తుతం వీరిద్దరి వివాహ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక రకుల్ వివాహం చేసుకోబోతుందని తెలిసి తన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక వీరి వివాహానికి సంబంధించిన పనులను రకుల్, జాకీ ఏర్పాటు చేసుకుంటున్నారట.

Visitors Are Also Reading