శతాధిక దర్శకునిగా పేరున్న సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు యంగ్ జనరేషన్ తో కూడా పోటీ పడుతూ భారీ హిట్ సాంగ్స్ అందుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతున్నారు. చాలా రోజుల నుంచి ఆయన మెగాఫోన్ పట్టడం లేదు. 2017లో నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన నమోవెంకటేశా ఆయన తీసిన చివరి సినిమా. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇంతకు ముందు ఈయన రసభరిత సినిమాలు తీస్తుండగా, ఆయనపై అకస్మాత్తుగా పలు విమర్శలు గుప్పించడంతో తన శైలిని మార్చారు. రసభరిత సన్నివేశాల నుంచి ఏకంగా భక్తిరస చిత్రాలను తెరకెక్కించడంలో మొదలుపెట్టారు.
Advertisement
అక్కినేని నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డిసాయి సినిమాలు, బాలకృష్ణతో పాండురంగడు వంటి సినిమాలు భక్తి, రక్తి కలయికతో దర్శకత్వం వహించారు. గత సంవత్సరం రాఘవేంద్రరావు ఎన్టీఆర్ పుట్టిన రోజు క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు డైరెక్టర్లతో తీయబోతున్నారని.. ముగ్గురు డైరెక్టర్లలో ఒకరిగా అలాగే సినిమాకు నిర్మాతగా ఉండాలని ఆయన ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
Advertisement
Also Read : వేణు స్వామి భార్య ఎవరో తెలుసా..ఆమె గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
ఒకానొక సమయంలో త్రిశూలం సినిమాలో హీరోయిన్‌గా జయసుధ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు జయసుధ కంటే ముందుగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ స్మిత పాటిల్ సంప్రదించారట. ఆవిడ కథ విన్నాక అంతా నచ్చిందని నేను సినిమా చేస్తానని ఒప్పుకున్నారు.
ఆ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారని తెలియడంతో ఆవిడ ఆ సినిమాను వదులుకున్నారు. దీనికి కారణం ఆమెను అడిగితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమాలో ఏదో చిన్న పాయింట్‌ను తీసుకొని లాజిక్ లేకుండా సినిమాలు తీస్తారు. అటువంటి వారితో నేను అసలు సినిమాలు చేయను అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read : విడాకుల తరవాత ప్రశాంతంగా పడుకున్నా..నోయల్ పై మాజీ భార్య ఫైర్..!