Home » ఏడాదిలోనే 10కి పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన హీరోలు వీరే..!!

ఏడాదిలోనే 10కి పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన హీరోలు వీరే..!!

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో పాన్ ఇండియా చిత్రం రిలీజ్ కావాలంటే మూడు నుంచి నాలుగు ఏళ్ళు పడుతుంది. కామన్ సినిమాలు అయితే కనీసం సంవత్సరం కాలం తీసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సమయంలో వీరు ఒక్కో సంవత్సరం లో కనీసం 10 చిత్రాల్లో అయినా నటించేవారు. కనీసం 10 చిత్రాలైన విడుదలయ్యేవి. అలా ఒకే సంవత్సరం పదికి పైగా చిత్రాల్లో నటించి విడుదలైన సినిమాలు ఏంటో చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ:

కృష్ణ తన 5 దశాబ్దాల సినీ కెరీర్ లో మొత్తం 350కి పైగా చిత్రాల్లో నటించారు. 1970లో మొత్తం 16 చిత్రాల్లో నటించగా, తర్వాతి ఏడాది అందులో 11 మూవీస్ థియేటర్లోకి వచ్చాయి. 1972లో ఒకేసారి 18సినిమాలు విడుదలయ్యాయి. ఈనాటికి కృష్ణ రికార్డు బ్రేక్ చేసిన వారు లేరు.
సీనియర్ ఎన్టీఆర్:

ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన రికార్డ్ లో 2వ స్థానం నందమూరి తారకరామారావుది. 1964లో 17 సినిమాలు విడుదలయ్యాయి..

రెబల్ స్టార్ కృష్ణంరాజు:

1964లో కెరీర్ ప్రారంభించగా మొత్తం 190 చిత్రాల్లో నటించారు. వాటిల్లో 1974లో 17 సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలయ్యాయి.

ANR:


ధర్మపత్ని అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ANR.. ఏడాదికి దాదాపు 5-6 సినిమాలు ఉండేలా చూసుకునేవారు.1971, 1984 లో ఏడాదికి తొమ్మిది చొప్పున సినిమాలు విడుదలయ్యాయి.

శోభన్ బాబు:


1959లో దైవబలం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శోభన్ బాబు. మొత్తం 230 చిత్రాల్లో నటించారు. వీటిల్లో 12 చిత్రాలు 1980 ఏడాదిలో విడుదలయ్యాయి.

రాజేంద్రప్రసాద్:

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా మారి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటుడు రాజేంద్రప్రసాద్. ఇప్పటివరకు 300 కి పైగా సినిమాల్లో నటించారు. 1988లో మొత్తం 17 సినిమాలు విడుదలయ్యాయి.

చిరంజీవి:

చిరంజీవి 1980లో మొత్తం 14 సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. వాటిల్లో మొదటిది అగ్నిసంస్కారం, చివరిది రక్త బంధం సినిమా.

also read:సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణం కమనీయం.. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే..?

Visitors Are Also Reading