Home » Nuvve Kavali: ‘నువ్వే కావాలి’ సినిమాని మిస్ చేసుకున్న.. టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

Nuvve Kavali: ‘నువ్వే కావాలి’ సినిమాని మిస్ చేసుకున్న.. టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

by Sravya
Ad

Nuvve Kavali: చాలామంది ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అలా తెలుగు ఇండస్ట్రీ నుండి చాలా మంది హీరోలు హీరోయిన్లు కొంతకాలం సినిమాలు చేసిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. లవర్ బాయ్ అంటే గుర్తొచ్చేది తరుణ్ ఎన్నో ప్రేమ కథలు లో నటించి యూత్ ని అలరించారు తరుణ్. కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి అందులో నువ్వే కావాలి సినిమా కూడా ఒకటి. నువ్వే కావాలి మూవీ 2000 లో వచ్చింది పెద్ద హిట్ అయింది. నువ్వే కావాలి సినిమాకి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది నువ్వే కావాలి మూవీ దాదాపు కోటి రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.

Advertisement

20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది మొత్తం 20 సెంటర్లలో దాదాపు 200 రోజులు పైగా ఆడింది. నేషనల్ అవార్డు తో పాటు అనేక రికార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఇందులో తరుణ్ సరసన రిచా పల్లోడ్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ని అందించారు. కోటి ఈ సినిమాకి పాటలు అందించారు ఈ సినిమాలోని సాంగ్స్ డైలాగ్స్ ఏదో ఒక సందర్భంలో మనకి వినపడుతూనే ఉంటాయి.

Advertisement

Also read:

తరుణ్ కెరీర్ ని కూడా టర్న్ చేసేసింది ఈ మూవీ అయితే మొదట ఈ సినిమాలో నటించే అవకాశం హీరో సుమంత్ కి వచ్చింది. అప్పుడే ఆయన మరో సినిమాతో బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ మూవీలో నటించలేకపోయారు. దీంతో తరుణ్ కి అవకాశం వచ్చింది. సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. పైగా ఈ సినిమాతో తరుణ్ లైఫ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని తరుణ్ తెచ్చుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading