Telugu News » Blog » హీరో విశాల్:ఆ పని చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటా..?

హీరో విశాల్:ఆ పని చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా హీరో విశాల్ మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విశాల్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి విశాల్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు..

Advertisement

Vishal

అదేంటో ఇప్పుడు చూద్దాం.. విశాల్ డైరెక్టర్ వినోద్ కుమార్ డైరెక్షన్లో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. రానా ప్రొడక్షన్ బ్యానర్ పై నందా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ వీడియో బయటకు వచ్చింది. హైదరాబాదులో లాటి సినిమాకు సంబంధించి ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు.. ఈ సందర్భంలోనే యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు విశాల్.. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే.. అభినయ గురించి తెలుసుకోవాలని ఉంది అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నా పెళ్లి పై నేను మొదటినుంచి చెప్తున్న మాట ఇదే..

Advertisement

also read:లక్ష్మీపార్వతి ఫొటోను ఎన్టీఆర్ చించేశారా..? ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా.. !

మరోసారి కూడా చెబుతున్నాను.. సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాతే నా పెళ్లి జరుగుతుంది. 3500 కుటుంబాలు 30 సంవత్సరాల నుండి మేకప్ మరియు చిరిగిపోయిన బట్టలతో చిన్న చిన్న నాటకాలు డ్రామాలు వేసుకుంటూ బతుకుతున్నారు. వారందరూ బాగుండాలి, వారందరికీ హెల్త్ పరంగా కానీ వారి జీవనానికి అవసరమైన పెన్షన్లు కానీ ఇప్పించిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని చెప్పారు. త్వరలోనే ఆ బిల్డింగ్ ఓపెనింగ్ చేస్తానని దీనికి మీ అందరిని పిలుస్తానని, అలాగే నా పెళ్లికి కూడా అందరిని పిలుస్తానని టీజర్ లాంచ్ సమయంలో విశాల్ తన మనసులో ఉన్న మాటలు బయట పెట్టారు.

Advertisement

also read:

You may also like