Home » హీరో శివాజీని తల్లి అన్ని కష్టాలు పడి సాకిందా ?

హీరో శివాజీని తల్లి అన్ని కష్టాలు పడి సాకిందా ?

by Anji
Ad

బిగ్‌బాస్ తెలుగు సీజన్ -7 మాములుగా ఉండదని నాగార్జున అక్కినేని  ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు వచ్చిన ప్రోమోలు అన్నీ ఉన్నాయి. ఇక కంటెస్టెంట్ల సెలక్షన్‌లో కూడా ఈ మార్పు కనిపించింది. మరీ నాసిరకం కంటెస్టెంట్లు కాకుండా ఈసారి ఏరికోరి మరి తీసుకువచ్చారు. ఇక హీరో శివాజీ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన సినిమా కష్టాలను, పేదరకాన్ని అన్నీ తెలియజెబుతూ శివాజీ ఓ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే   నటన టాలెంట్ తో పాటు  అదృష్టం కూడా ఉండాలి. అలా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ ఎన్నో కష్టాలు పడి హీరోగా మారారు. ఆయన మిస్సమ్మ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . అలాంటి హీరో శివాజీ ఈ చిత్రం తర్వాత అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలే కాకుండా అనేక కామెడీ చిత్రాల్లో కూడా నటించారు. 

Advertisement

 అలాంటి శివాజీ తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారట. తన తల్లి ఝాన్సీ లక్ష్మి  సంక్రాంతి పండుగ వచ్చిందంటే తను సంవత్సరంలో సాకిన కోళ్లను అమ్మి ఆయనకు బట్టలు కొనేదట.  అలా ఎన్నో కష్టాలు పడ్డ శివాజీ హైదరాబాద్ కి ఏదైనా పని చూసుకుందామని వచ్చి, అనుకోకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారట. అలా హీరోగా ఎదిగిన శివాజీ కొన్నాళ్లు రాణించి ఆ తర్వాత కనుమరుగైపోయారు.  ప్రస్తుతం బిగ్బాస్ 7 ద్వారా రీఎంట్రీ ఇచ్చారు శివాజీ. మరి చూడాలి ఆయన బిగ్ బాస్ 7 హౌసులో కొనసాగుతారా, లేదంటే మధ్యలోనే వెళ్లిపోతారా అనేది ముందు ముందు తెలుస్తుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 షారూఖ్ ఖాన్ జవాన్ కి అల్లు అర్జున్ కి ఉన్న లింక్ ఏంటో తెలుసా ?

బిగ్ బాస్ 7 సీజన్ లో చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీరే..!

Visitors Are Also Reading