సినిమా ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ లు ప్రేమించుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు అయితే డేటింగ్ లు చేస్తున్నారు కానీ ఒకప్పుడు నిజంగా ప్రేమిస్తే మాత్రం పెళ్లి చేసుకుని కలిసి ఉండేవాళ్ళు. అయితే పెళ్లి కాకుండా మధ్యలోనే బ్రేకప్ అయిన లవ్ స్టోరీ లు కూడా ఇప్పుడే కాకుండా ఒకప్పుడు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జంటలు కూడా ఉన్నయి. మరి కొన్ని జంటలు అయితే పెళ్లి వరకూ వెళ్లి కూడా ఆగాయి.
ఇవి కూడా చదవండి: కొరటాల స్టార్ డైరెక్టర్ అవ్వడానికి సింహా సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఆ మోసం తరవాతే..?
Advertisement
ఇప్పుడు చెప్పుకొబోయే వార్తల్లో నిజం ఎంత ఉందో చెప్పలేం కానీ ఒకప్పుడు ఆ వార్త ఇండస్ట్రీ ని షేక్ చేసింది. అదే రాజేంద్ర ప్రసాద్ ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించడం. రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం నటుడు గా టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా కూడా సినిమాలు చేశారు. ఈ క్రమం లో హీరోయిన్ రజినీ తో రాజేంద్రప్రసాద్ ఎక్కువ సినిమాలను చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి: పారిపోయిన యూట్యూబర్.. అతని ఆచూకి చెప్పిన వారికి రూ.25వేల రివార్డ్..!
దాంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి. జంద్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహానాపెళ్ళంట సినిమా లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా తరవాత చాలా సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే రజినీ, రాజేంద్ర్రసాద్ ప్రేమలో ఉన్నారు. అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
రజినీ రాజేంద్ర ప్రసాద్ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు అంటూ టాక్ వినిపించింది. అయితే చాలా కాలం తరవాత ఆ వార్తలపై రజినీ స్పందించారు. రాజేంద్రప్రసాద్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ఇప్పటికీ తమ మధ్య అలాంటి స్నేహమే ఉందని అన్నారు.